telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఆలోక్ వర్మ.. వచ్చిందే తడవు.. అన్ని ఆపేశాడు.. 

all transfers are cancelled by cbi director
సీబీఐ లో కూడా ఇటీవల కొన్ని గజిబిజి సందర్భాలు చోటుచేసుకోవడం, దేశరాజకీయాలనే ప్రశ్నించింది. దీనితో కల్పించుకున్న కోర్టు, ప్రభుత్వం సీబీఐలో వేళ్ళు పెట్టకూడదని తేల్చడంతోపాటుగా, తిరిగి ఆలోక్ వర్మనే డైరెక్టర్ గా నియమించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ డైరెక్టర్ గా మరోసారి బాధ్యతలు చేపట్టిన ఆలోక్‌ వర్మ, కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాత్కాలిక సీబీఐ డైరెక్టర్ గా  నాగేశ్వరరావు చేసిన అధికారుల బదిలీలను రద్దు చేశారు. 
అక్టోబర్‌ 24 నుంచి జనవరి 8 వరకు జరిగిన పలు బదిలీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. సీబీఐలో డైరెక్టర్‌ గా ఉన్న ఆలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ గా ఉన్న రాకేశ్‌ అస్థానాల మధ్య విభేదాలు తలెత్తగా, కేంద్రం వారిద్దరిని బలవంతపు సెలవుపై పంపిన సంగతి తెలిసిందే. ఆపై వెంటనే ఒడిశా క్యాడర్‌ అధికారి ఎం.నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్‌ గా నియమించారు. ఆపై ఆయన పలువురిని బదిలీ చేశారు. ఇప్పుడా బదిలీలను అలోక్ వర్మ నిలిపివేశారు.

Related posts