telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ .. రాజధాని నిర్మాణంలో .. సింగపూర్ కి .. హ్యాండ్ ..

another 7 five star hotels in amaravati

రాజధాని నిర్మాణం ముసుగులో సింగపూర్ కంపెనీల వివిధ కాంట్రాక్టులకు సంబంధించిన టెండర్లన్నింటినీ జ్యుడీషియల్ కమీషన్ కు ఇవ్వటంతో సింగపూర్ కంపెనీల స్విస్ ఛాలెంజ్ విధానానికి మంగళం పాడటానికి రంగం సిద్ధమైనట్లే. ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబ్లింగ్ చట్టానికి సవరణలు తీసుకురావాలని జగన్ నిర్ణయించారు. ఇందులో భాగంగానే గత ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టులన్నింటినీ పునస్సమీక్ష చేయటానికి అవకాశాలు వస్తాయి. దాని ద్వారా స్విస్ ఛాలెంజ్ పద్దతికి స్వస్తి పలికే అవకాశం ఉండటంతో సింగపూర్ కంపెనీలకు తద్వారా చంద్రబాబుకు జగన్ పెద్ద షాక్ ఇవ్వబోతున్నట్లే అనుకోవాలి. రాజధాని నిర్మాణం ముసుగులో కానీ ఇతరత్రా కానీ చంద్రబాబు భారీగా అవినీతికి పాల్పడినట్లు అర్ధమవుతోంది.

తనకు కావాల్సిన వాళ్ళకు చంద్రబాబు నామినేటెడ్ పద్దతిలో వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు కట్టబెట్టిన విషయాలపై ఇప్పటికే అనేక ఆరోపణలున్నాయి. జగన్ తీసుకురాబోతున్న జ్యుడీషియల్ కమీషన్ ముందుకు ఆ కాంట్రాక్టులన్నీ వస్తే నిజంగా చంద్రబాబుకు ఇబ్బందులు తప్పేట్లు లేదు. ఏపీసీఎం ముఖ్యఉద్దేశ్యం అంతా కాంట్రాక్టుల్లో అవినీతిని తగ్గించటం, రివర్స్ టెండరింగ్ ద్వారా కాంట్రాక్టు మొత్తాన్ని వీలైనంతగా తక్కువ చేసి ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చటమే. జగన్ ఆలోచనలకు తగ్గట్లుగా జ్యుడీషియల్ కమీషన్ పనిచేయగలిగితే ఖజానాకు భారీగా నిధులు మిగలటమే కాకుండా ఆ మేరకు ఆదాయం పెరిగినట్లుగా అవుతుందనటంలో సందేహం లేదు. జగన్ నిజంగానే స్విస్ ఛాలెంజ్ కాంట్రాక్టులను రద్దు చేయగలిగితే న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా చూసుకోవాల్సిందే.

Related posts