telugu navyamedia
సినిమా వార్తలు

పాక్ నటీనటులను బ్యాన్ చేయాలంటూ ప్రధానికి లేఖ

Modi

కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపతి కల్పించే 370 అధికరణను భారత్ రద్దు చేయడంపై పాకిస్తాన్ గగ్గోలు పెడుతోంది. ఇది తమ దేశ అంతర్గత వ్యవహారమని భారత్ స్పష్టం చేసినప్పటికీ పాక్ మాత్రం కశ్మీర్‌పై భారత్ వైఖరిని తప్పుబడుతోంది. ఇప్పటికే భారత్‌తో వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకున్న పాకిస్తాన్… భారత్-పాకిస్తాన్ మధ్య రాకపోకలు సాగించే సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలును పాక్ నిలిపివేసినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు భారత సినిమాలను తమ దేశంలో ప్రదర్శించకుండా నిషేధం విధిస్తున్నట్లు పాకిస్థాన్ తెలిపింది. ఈ నేప‌థ్యంలో ఆల్‌ ఇండియన్‌ సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ (ఏఐసీడబ్ల్యూఏ) పాక్ న‌టీన‌టులని భార‌త్ సినిమాల‌లో న‌టించ‌కుండా చూడాలని ప్ర‌ధానిని కోరింది. పాకిస్థాన్ ప్ర‌భుత్వం భార‌త సినిమాల‌ని నిషేదించిన క్ర‌మంలో మ‌నం కూడా పాక్‌కి సంబంధించిన ఆర్టిస్టులు, సంగీత క‌ళాకారులు, దౌత్యవేత్తలపై నిషేధం విధించాలని ఏఐసీడబ్ల్యూఏ డిమాండ్‌ చేస్తోంది. వారిని నిషేదించే వ‌ర‌కు మొత్తం చిత్ర పరిశ్రమ, సినీ కార్మికులు తిరిగి పనులు మొదలుపెట్టరు అని ఏఐసీడబ్ల్యూఏ త‌మ‌ లేఖలో పేర్కొంది. మ‌రి దీనిపై మోదీ ఎలా స్పందిస్తారో చూడాలి.

Related posts