telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రేపే నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు

AP Local Body Elections 2020 Reservation List Finalaized

ఆంధ్ర ప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు విడత ఎన్నికలు పూర్తి అయ్యాయి. పంచాయతీ ఎన్నికలైనప్పటికీ…సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మధ్య హోరా హోరీగా పోటీ నడుస్తోంది.  ఇక రేపు చివరిదైన నాలుగో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో నిన్న సాయంత్రంతో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు ఉదయం 6.30 గంటలకు ప్రారంభం అయ్యే పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ముగియనుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. కాగా, నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 13 జిల్లాల్లోని 161 మండలాల్లో పోలింగ్ జరుగనుంది. 3,299 పంచాయతీలు… 33,435 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా 553 పంచాయతీలు, 10,921 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవం కాగా మిగిలిన పంచాతీయలకు, వార్డులకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలో అత్యధికంగా ఉత్తరాంధ్ర జిల్లాల పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

Related posts