telugu navyamedia
సినిమా వార్తలు

తండ్రి చనిపోయాడంటూ రూమర్స్.. స్పందించిన అలియా

Alia

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్‌భట్ గుండెపోటుతో మృతి చెందారంటూ రెండుమూడ్రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హోరెత్తిపోతున్నాయి. గుండెపోటు వల్ల ఆయన చనిపోయారని గాసిప్‌లు బయల్దేరాయి. ఈ నేపథ్యంలో మహేష్ భట్ కూతురు, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ స్పందించింది. తన తండ్రి క్షేమంగా ఉన్నారని తెలిపింది. “మా నాన్న చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఆయనకు అంత తొందర లేదు. మమ్మల్నందర్నీ ఇప్పటికీ ఆయనే పోషించాలి” అని పేర్కొంది. కాగా ప్రస్తుతం మహేష్‌భట్ ‘సడక్-2’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సంజయ్ దత్, ఆలియా భట్, పూజా భట్ తదితరులు నటిస్తున్నారు. ఇది 1991లో వచ్చిన ‘సడక్’ సినిమాకు సీక్వెల్. దీనిని రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందించారు. అయితే సీనియర్ దర్శకనిర్మాతలు, నటీనటులపై ఇలాంటి రూమర్స్ వ్యాప్తి చేయడం అనేది బాధాకరమైన విషయం.

Related posts