telugu navyamedia
telugu cinema news

“ఆర్ఆర్ఆర్” : అలియా పారితోషికం ఇదే…!?

Alia-Bhatt

రాజమౌళి దర్శకత్వంలో “ఆర్ఆర్ఆర్” అనే టైటిల్ తో భారీ మల్టీస్టారర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, రామ్ చరణ్ కు జోడిగా సీత ఏ పాత్రలో అలియా భట్, కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్, ఎన్టీఆర్ కు జోడిగా డైసీ ఎడ్గార్ జోన్స్ ను ఎంపిక చేసినట్లుగా రాజమౌళి వెల్లడించారు. ఈ చిత్రం దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. దీంతో అలియా భట్ ఈ సినిమా కోసం భారీ పారితోషికాన్ని అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

త్వరలోనే అలియా ఈ సినిమా షూటింగులో పాల్గొననుంది. ఈ సినిమా కోసం ఆమెకి అందే పారితోషికం విషయం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా కోసం అలియాకు ముట్టజెప్పే పారితోషికం అక్షరాలా 5 కోట్లు అని తెలుస్తోంది. అంతేకాదు అలియా భట్ కి సంబంధించిన టీమ్ ఖర్చులు, స్టార్ హోటల్లో బస ఖర్చులు, ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు కాకుండా ఆమె పారితోషికాన్ని 5 కోట్లుగా ఫిక్స్ చేశారని అంటున్నారు. తెలుగులో స్టార్ హీరోయిన్స్ 3 సినిమాలకి కలిపి అందుకునే పారితోషికాన్ని అలియా ఒకే సినిమాకు అందుకుంటోంది. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది. అందుకే అలియా భట్ భారీగా డిమాండ్ చేసిందట. బేరసారాల తరువాత అలియా భట్ కు 12 నుంచి 15 కోట్ల పారితోషికం అందుతుందని అంటున్నారు. ఇక ఈ చిత్రం 2020 జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Related posts

ట్రాన్స్‌జెండర్లకు అండగా శేఖర్ కమ్ముల

vimala p

“జెర్సీ” రీమేక్ కోసం బ్యాట్ పట్టుకున్న కబీర్ సింగ్

vimala p

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్… పూజా హెగ్డే ఫస్ట్ లుక్

vimala p