telugu navyamedia
సినిమా వార్తలు

రాజమౌళికి కృతజ్ఞతలు చెప్పిన అలియా భట్

Alia-Bhatt

రాజమౌళి నేడు ఆర్.ఆర్.ఆర్ చిత్రంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజమౌళి, చరణ్, తారక్, దానయ్య తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం… వీరిద్దరూ ఒకే చోట ఉండి, ఉద్యమంలో పాల్గొంటే ఎలా ఉండబోతుంది అనేదే రాజమౌళి తనదైన శైలిలో తెరకెక్కించనున్నారు. ఇక ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, రామ్ చరణ్ కు జోడిగా అలియా భట్, ఆమె పాత్ర పేరు సీత అని, ఆమె పాత్రే కథను కీలక మలుపు తిప్పుతుందని రాజమౌళి అన్నారు. కొమరం భీం పాత్రలో తారక్, ఎన్టీఆర్ సరసన డేజీ ఎడ్గర్ జోన్స్ అనే విదేశీ భామ నటిస్తోంది. ఇక అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అన్ని భాషలకు ఆర్.ఆర్.ఆర్ కామన్ టైటిల్. కానీ ప్రతి భాషకు ఒక్కో టైటిల్ ఉంటుంది. 2020 జూలై 30 నాటికి సినిమా విడుదలవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా అలియా భట్ రాజమౌళి మాటలకు స్పందించారు. అలియా అంత పెద్ద టీంతో జర్నీ ప్రారంభించడానికి చాలా ఆసక్తిగా ఉన్నానంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు రాజమౌళికి కృతజ్ఞతలు చెప్పుకుంది.

Related posts