telugu navyamedia
సినిమా వార్తలు

రణబీర్ కపూర్ పై కంగనా వ్యాఖ్యలు… స్పందించిన అలియా భట్

Kangana-Ranauth-and-Alia-BHatt

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ బాధ్యత లేని వ్యక్తి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది కంగనా. “రణబీర్ కపూర్ లాంటి నటులు సమాజం పట్ల బాధ్యత లేదు. వాళ్ల ఇంటికి కరెంట్, నీరు నిరాటంకంగా అందుబాటులో ఉంటుంది. లగ్జరీ ఇళ్లలో ఉంటూ, మెర్సిడెస్ బెంజ్ కార్లలో తిరుగుతారు. ఇదంతా దేశ ప్రజల వల్ల వచ్చిందే. కానీ, ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు మాత్రం ఇలాంటి వారు ఇష్టపడరు. నేను అలాంటి వ్యక్తిని కాదు” అని వ్యాఖ్యానించింది. తాజాగా అలియా భట్ తన ప్రియుడు రణబీర్ కపూర్ పై కంగనా చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. “కంగనా లాగా దాపరికాలు లేకుండా నేను మాట్లాడలేను. ఆమె వ్యాఖ్యలను గౌరవిస్తున్నాను. ఒక రకంగా ఆమె చెప్పింది కూడా నిజమే కావచ్చు. నిజాయతీగా ఆమె మాట్లాడే తీరు ఆకట్టుకుంటుంది” అంటూ చెప్పుకొచ్సినది అలియా భట్. గతంలో ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ రాజకీయాలపై స్పందించడానికి నిరాకరించిన విషయం తెలిసిందే.

Related posts