telugu navyamedia
సినిమా వార్తలు

స్టేజ్ పైనే స్టార్ హీరోకు “ఐ లవ్ యూ” చెప్పిన హీరోయిన్

Ranbir-Kapoor

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, క్యూట్ బ్యూటీ అలియా భట్ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించలేదు ఈ జంట. తాజాగా అందరిముందూ రణబీర్ పై తన ప్రేమను వ్యక్తపరిచింది అలియా. “రాజీ” సినిమాలో ఉత్తమ నటనకు గానూ అవార్డు అందుకుంది అలియా. ఈ సందర్భంగా అవార్డు అందుకోవడానికి స్టేజ్ పైకి వెళ్లిన అలియా ఆ అవార్డుకు కారణమైన వారికి, ప్రేక్షకులకు, చిత్రబృందానికి థ్యాంక్స్ చెప్పింది. ఆ తరువాత తన జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి రణబీర్ అంటూ అతడికి “ఐ లవ్ యూ” చెప్పేసింది అలియా. ఆమె ఆలా చెబుతున్నప్పుడు రణబీర్ సిగ్గుపడుతూ తన ముఖానికి చేయి అడ్డం పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇప్పట్లో పెళ్ళి చేసుకునే ఉదేశ్యం లేదని అలియా ఇప్పటికే చెప్పేసింది. ప్రస్తుతం అలియా భట్, రణబీర్ కపూర్ జంటగా “బ్రహ్మాస్త్ర” చిత్రం రూపొందుతోంది. ఇక అలియా తెలుగులో “ఆర్ఆర్ఆర్”లో ఒక హీరోయిన్ గా నటిస్తోంది.

Related posts