telugu navyamedia
సినిమా వార్తలు

ఆలియా భట్ ప్రెగ్నెంట్..ఇన్​స్టాలో పోస్ట్..

బాలీవుడ్ ల‌వ్‌బ‌ర్డ్స్‌ అలియా భ‌ట్‌, ర‌ణ‌బీర్ క‌పూర్‌ ఏప్రిల్ 14న  వివాహ బంధంతో ఒక్కటైయ్యారు. ఐదేళ్ళ ప్రేమ‌లో ఉన్న వీరిద్దరు బాంద్రాలోని వాస్తులో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరిద్దరు వివాహం చేసుకున్నారు .వీరిద్దరూ తమ మ్యారేజ్ లైఫ్ ని అన్యోన్యంగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. 

 Alia Bhatt : ఆలియా భట్ సినిమాల విషయానికి వస్తే.... తన తండ్రి మహేష్ భట్ వారసత్వంగా సినిమాల్లోకి వచ్చింది. అయినా తనదైన నటనతో ప్రేక్షకుల్నీ మెప్పిస్తోంది. ఆమె నటించిన మొదటి సినిమా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్', ఆ తర్వాత 'డియర్ జిందగీ, 'హైవే', 'రాజీ' మొదలగు సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఆమె నటించిన గంగూబాయి కతియావాడి ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. అంతేకాదు అలియాకు మంచి పేరును తెచ్చింది.Photo : Twitter

తాజాగా అలియా భట్ గుడ్ న్యూస్ ని తెలిపింది. అలియా, రణబీర్ జంట తల్లిదండ్రులు కాబోతున్న‌ట్లు అలియా భట్‌ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. తన అల్ట్రా సౌడ్ స్కానింగ్‌ రిపోర్టును ఇన్​స్టాలో పోస్ట్ చేసింది. అవర్ బేబీ కమింగ్ సూన్ అంటూ రాసుకొచ్చారు.

చెకప్ చేయించుకున్న తర్వాత హాస్పిటల్ బెడ్ పై నుంచి అలియా ఈ న్యూస్ ఫ్యాన్స్ కి తెలియజేసింది. హాస్పిటల్ బెడ్ పై ఉన్న పిక్ ని కూడా పంచుకుంది. అలియా పక్కనే ఆమె భర్త రణబీర్ కపూర్ కూడా ఉన్నాడు.

ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అలియాకు ప్రెగ్నెన్సీ కావడంతో సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక ఆలియా సినిమాల విషయానికి వస్తే.. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్‌ల ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో మంచి విజయాన్ని అందుకుంది.ఆర్ ఆర్ ఆర్‌లో సీత పాత్రలో నటించింది. 

ఆ సినిమాతో పాటు అలియా భట్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గంగూబాయి కతియావాడి’ సినిమాతో నటించి అదరగొట్టారు.

అలాగే ఆలియా, రణబీర్‌ కలిసి నటించిన బ్రహ్మాస్త చిత్రం సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Related posts