telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీలో మద్యం కట్టడిలో మరో అడుగు .. ఇకమీదట వ్యక్తికి మూడు సీసాలే….

new alcohol shops open in AP

రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని మరింత కట్టుదిట్టం చేసేందుకు ప్రభత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.. మద్యనిషేధంలో భాగంగా సీఎం జగన్‌మోహన్ రెడ్డి కొత్త పాలసీని తీసుకువచ్చారు.. ఈనేపథ్యంలోనే సమీక్ష సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన ఆదేశాలను అధికారులు ఒక్కోక్కటి అమలు పరుస్తున్నారు. మద్యం బాటిళ్ల పరిమితిపై ఉత్తర్వులు జారీ చేశారు. ఓక్కో వ్యక్తి వద్ద మూడు బాటిళ్లు మాత్రమే ఉండే విధంగా నిబంధనల్లో పేర్కోన్నారు. గతంలో ఒక్కో వ్యక్తి వద్ద ఆరు బాటిళ్ల వరకు ఉండేందుకు అనుమతి ఉండేది. ఏపీలో నూతన మద్యం పాలసీని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చిన నేపథ్యంలో మద్య నిషేధంపై దశాల వారిగా చర్యలు తీసుకుంటున్నారు.

సెప్టెంబర్ 1 నుండి నూతన మద్యం పాలసీలో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా సెప్టెంబర్ ఒకటి నుండి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తున్నారు. దీంతో పాటు పర్మిట్ గదులను కూడ ప్రభుత్వం రద్దు చేసింది. నవరత్నాల హమీలో భాగంగా మద్యనిషేధాన్ని కూడ కొనసాగించేందుకు వైసీపీ ప్రభుత్వం నడుం బిగించింది. దీంతో ఒక్కో నిర్ణయాన్ని అమలు పరిచేందుకు సమాయత్తమవుతోంది. నిబంధనల ప్రకారం రాత్రీ తొమ్మిది గంటల వరకే మద్యం అమ్మకాలు కొనసాగించడం, ఎమ్మార్పీ ధరలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందు చర్యలు చేపట్టారు. ఇక బెల్టుషాపులు, మద్యం షాపులు తగ్గింపు లాంటీ చర్యలను ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. రానున్న కొద్ది రోజుల్లో సంపూర్ణ మద్యనిషేధం వైపుకు జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Related posts