telugu navyamedia
సినిమా వార్తలు

అదిరిపోయిన “అల్లాద్దీన్” ట్రైలర్

Aladdin-Trailer

మన చిన్నప్పుడు డిస్నీ ఛానెల్ లో… ఒక సాధారణ యువకుడి పేరు అల్లాద్దీన్… ఆ యువరాణి పేరు జాస్మిన్… వీళ్లకు జీని అనే ఒక భూతం దొరుకుతుంది… ఇంకా వీళ్ళ దగ్గర ఓ ఎగిరే తివాచి, ఒక కోతి ఉంటాయి… జీని చేసే మాయలతో, ఆ యువరాణి, యువకుడు ఎగిరే ఆ తివాచిపై తమకు కావాల్సిన చోటికి వెళ్ళడం వంటి సన్నివేశాలతో “అల్లాద్దీన్… అద్భుతంగా దీపం” అంటూ మనల్ని మైమరపించిన విషయం గుర్తుందా ? ఈ కార్టూన్ కథ టీవిలో ఎన్నిసార్లు చూసినా చూడాలన్పిస్తూనే ఉంటుంది. ఇన్నిరోజులు కార్టూన్ గా వచ్చిన ఈ చిత్రాన్ని తాజాగా మరోసారి డిస్నీవాళ్లు సినిమాగా మన ముందుకు తీసుకొస్తున్నారు.

ప్రముఖ దర్సకుడు గై రిచీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యాంటసీ చిత్రంలో మెనా మస్సూద్ అలాద్దిన్ పాత్రలో, హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్ జినీగా, జాస్మిన్ యువరాణి పాత్రలో నవోమి స్కాట్, మాంత్రికుడు జఫార్ పాత్రలో మార్వాన్ కెంజారి నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం వేసవి కానుకగా మే 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts