ఉత్తర ఆఫ్రికా ఆల్ ఖయిదా చీఫ్ అబ్దుల్ మాలిక్ డ్రౌకడెల్ను హతమార్చినట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. మాలిక్ కోసం ఫ్రెంచ్, మాలి సైన్యాలు ఏడేళ్లుగా గాలిస్తుండగా ఎట్టకేలకు పని పూర్తి చేశాయి. మాలే దేశంలో జరిగిన ఆపరేషన్లో ఆ ఉగ్రవాదిని హతమార్చారు. డ్రౌకడెల్తో పాటు అతని సభ్యులు కొందరు హతమైనట్లు ఫ్రాన్స్ రక్షణశాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లే తెలిపారు.
నార్త్ అల్జీరియాలోని పర్వత సానువుల్లో మాలిక్ తలదాచుకున్నట్టు పక్కా సమాచారం అందుకున్న ఫ్రెంచ్ సైన్యం, స్థానిక సైన్యంతో కలిసి దాడి చేసింది. ఉత్తర మాలి, అల్జీరియా ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన ఈ దాడుల్లో మాలిక్ మరణించాడు. మాలిక్ మృతిని ధ్రువీకరిస్తూ ఫ్రాన్స్ ప్రకటన విడుదల చేసింది.
అబ్దెల్మాలిక్ గతంలో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సోవియేట్ దళాలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఇరాక్లోనూ ఆల్ఖయిదా నేతగా కొనసాగాడు. మాలే, బుర్కినోఫాసోలో జరిగిన పలు ఉగ్రవాద దాడులకు పాల్పడ్డాడు. ఓ మర్డర్ కేసులో అబ్దెల్కు 2012లో అల్జీరియా కోర్టు ఉరశిక్షను ఖరారు చేసింది. 2007లో అతనూ అల్జీర్స్లో బాంబు పేలుళ్లలకు పాల్పడ్డాడు.