telugu navyamedia
సినిమా వార్తలు

చిన్ని కృష్ణకు ప్రముఖ రచయితే వార్నింగ్

Akula-Shiva-and-Chinni-Krishna

టాలీవుడ్ లో ఇంద్ర, నరసింహనాయుడు లాంటి చిత్రాలకు కథలను అందించిన రైటర్ చిన్నికృష్ణకు గతకొంతకాలంగా అవకాశాలు బాగా తగ్గాయి. ఈ క్రమంలో చిన్నకృష్ణ మెగా ఫ్యామిలీ, జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ లపై సంచలన వ్యాఖ్యలు చేసి సంచలనంగా మారారు. వైసిపికి మద్దతుదారుడు కావడంతో చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, చిరంజీవిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దీంతో చిన్ని కృష్ణపై యుద్ధం ప్రకటించాడు మరో ప్రముఖ రచయిత ఆకుల శివ. చిన్నికృష్ణ మోసగాడని, అతడిపై చీటింగ్ కేసులు ఉన్నాయని, చాలా మంది రైటర్ల నుండి ఐడియాలను, కథలను దొంగిలించాడని తెలిపాడు. అంతేకాదు తారా చౌదరితో సహా చాలామంది మహిళలను అతడు మోసం చేశాడని, మరోసారి మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడితే నీ జాతకం బయట పెడతాను అంటూ చిన్ని కృష్ణకు వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు తాను దర్శకుడు కాకుండా అడ్డుకున్నది చిన్ని కృష్ణ అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. త్వరలోనే ఈ విషయాలకు సంబంధించి ఒక వీడియోను విడుదల చేయబోతున్నట్లు ఆకుల శివ ప్రకటించడం గమనార్హం. ఇప్పుడు ఈ వీడియో గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related posts