telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

2019 ఫోర్బ్స్ జాబితాలో 4వ స్థానంలో అక్షయ్ కుమార్

Forbs

ప్రతీ సంవత్సరంలాగే 2019 సంవ‌త్స‌రానికి గాను ఫోర్బ్స్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత పారితోషికం తీసుకుంటున్న ప్రముఖుల లిస్ట్‌ని కొద్దిసేప‌టి క్రితం ప్ర‌క‌టించింది. ఇందులో భారత్ నుంచి బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్‌కు మాత్రమే చోటు దక్కింది. 65 మిలియ‌న్ డాల‌ర్స్‌తో ఆయ‌న నాలుగో స్థానంలో నిలిచారు. డ్వైన్ జాన్స‌న్ ($89.4 మిలియ‌న్ డాలర్స్) తో తొలి స్థానం ద‌క్కించుకోగా, రెండో స్థానంలో థోర్ స్టార్ ( $76.4 మిలియ‌న్), మూడో స్థానంలో ఐర‌న్ మ్యాన్ రోబ‌ర్ట్ డౌనీ జూనియ‌ర్‌ ($66 మిలియ‌న్) ఉన్నారు. నాలుగవ స్థానంలో అక్షయ్ కుమార్ ($65 మిలియన్), ఐదవ స్థానంలో జాకీ చాన్‌( $58 మిలియ‌న్), ఆరవ స్థానంలో బ్లాడ్లీ కూప‌ర్ ($57 మిలియ‌న్‌), ఏడవ స్థానంలో ఆడ‌మ్ సాండ్ల‌ర్‌ ($57 మిలియ‌న్‌), ఎనిమిదవ స్థానంలో క్రిస్ ఎవాన్స్‌ ($43.5 మిలియ‌న్‌), తొమ్మిదవ స్థానంలో పాల్ రుడ్డ్‌ ($41 మిలియ‌న్), 10వ స్థానంలో విల్ స్మిత్ ($ 35 మిలియ‌న్) నిలిచారు. తాజా లెక్క‌ల‌ని బ‌ట్టి 51 ఏళ్ల అక్ష‌య్ ఒక చిత్రానికి కనీసం 5 నుండి 10 మిలియన్ల వరకు వసూలు చేస్తాడని ఫోర్బ్స్ చెబుతుంది. అంతేకాకుండా 20 కి పైగా ఉన్న‌ ఎండార్స్‌మెంట్ ఒప్పందాల నుండి అత‌ను మిలియన్లను సంపాదించాడని చెబుతున్నారు. ఏదైతేనేం బాలీవుడ్ స్టార్ భారత్ నుంచి ఈ జాబితాలో 4వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషమే.

Related posts