• Home
  • వార్తలు
  • అక్షయ్ కుమార్ ని తాకిన మీటూ…! లైంగిక వేధింపులకు పాల్పడి…
Trending Today వార్తలు సినిమా వార్తలు

అక్షయ్ కుమార్ ని తాకిన మీటూ…! లైంగిక వేధింపులకు పాల్పడి…

Akshay Kumar Tweets for Me Too Viral

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ వివాదం ఎంత దుమారం లేచిందంటే ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ లో కొందరికి ముచ్చెమటలు పట్టించింది… అదే రీతిలో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో మీ టూ ఉద్యమం చెలరేగిపోతుంది… మీ టూ ఉద్యమానికి మిశ్రమ స్పందనలు లభిస్తున్నాయి..ఏదేమైనప్పటికీ మీటూ ఉద్యమంతో చీకటి కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.. సినిమాల్లో అవకాశాల కోసం రాత్రి గడపాలని, అసభ్యకరంగా మాట్లాడేవారని. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవారని.. సినిమాలో నటించాలంటే కచ్చితంగా పడుకోవాలని, డ్యాన్స్ చేస్తుంటే బట్టలు చింపేవారని.. డ్రెస్ విప్పేసి మొత్తం చూపించమనేవారని..

వారికీ ఎదురు తిరిగితే అవకాశాలు రాకుండా చేస్తామని బయపెట్టేవారని చాలా మంది మహిళలను ఇలానే వాడుకున్నారని ఇలా చాలామంది మహిళలు తమకు ఎదురైన అనుభవాలను పంచుకుంటున్నారు.. కాగా తాజాగా దర్శకుడు సాజిద్ ఖాన్ పై బాలీవుడ్ నటి సలోని చోప్రా ఆరోపిస్తూ నటులు డ్రెస్ మార్చుకునే గదుల్లోకి వచ్చి అసభ్యంగా ప్రవర్తించేవాడని.. వారి బట్టలను విప్పి చూపించమని వేధించేవాడని.. అవకాశం కావాలా అయితే పడుకో లేదంటే సినిమాలో ఉండవని బెదిరించేవాడని ఇలా ఎంతో మంది మహిళలను వాడుకున్నాడని ఆరోపించింది.. ఈ విషయంపై స్పందించిన బాలీవుడ్ అగ్రనటుడు అక్షయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు…

వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో సినిమా చేసేదే లేదని అక్షయ్ తాజాగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.. కాగా అక్షయ్ గతరాత్రే ఇటలీ నుంచి వచ్చారు.. ఇక్కడ వచ్చిన వార్తలు నన్నెంతో డిస్టర్బ్ చేశాయి… అందుకే ‘హౌజ్ ఫుల్ 4’ సినిమా నిర్మాతలకి ఫోన్ చేసి అనుమానితులుగా ఉన్న వారి విచారణ పూర్తయ్యే వరకు సినిమా షూటింగ్ నిలిపి వేయాలని కోరాను ప్రస్తుత సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం ఎంతో అవసరం.. ఇక ఆరోపణలు కనుక నిర్దారణ అయితే భవిష్యత్తులో వారితో సినిమా చేసేది లేదని బాధితులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు…

హౌజ్ ఫుల్ 4 చిత్రం సాజిద్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా ఇందులో అక్షయ్ కుమార్, కృతిసనన్, కృతి కర్భందా ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.కాగా అక్షయ్ కుమార్ తన 28ఏళ్ల సినీ కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నడూ షూటింగ్ క్యాన్సిల్ చేసింది లేదు..

Related posts

నీతో డబ్బుంటే నువ్వే నా ప్రియుడివి.. ఎంతమందైన సరే.. దీప్తి

nagaraj chanti

ప్రియురాలిపై అనుమానంతో …. ముక్కలుగా నరికిన ప్రియుడు

jithu j

రేపే 'రంగుల రాట్నం'

admin

Leave a Comment