telugu navyamedia
సినిమా వార్తలు

కెనడా పౌరసత్వంపై స్పందించిన అక్షయ్ కుమార్

Akshay-Kumar

తన పౌరసత్వం గురించిన వివాదంపై అసహనం వ్యక్తం చేశాడు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్. తన పౌరసత్వంపై ఎందుకు అనవసరమైన ఆసక్తిని కనబరుస్తున్నారో అర్థం కావట్లేదని, తనకు కెనడా పాస్ పోర్ట్ ఉందనే విషయాన్ని తానెప్పుడూ దాచలేదని, గత ఏడేళ్లలో ఒక్కసారి కూడా తాను కెనెడా వెళ్లలేదని స్పష్టం చేశారు. తాను ఇండియాలోనే పని చేస్తున్నానని, ఇండియాలోనే అన్ని పన్నులు చెల్లిస్తున్నానని, ఇన్నేళ్ళలో దేశంపై తనకున్న ప్రేమను నిరూపించుకోవాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదని, తన పౌరసత్వాన్ని వివాదాస్పదం చేయడం బాధను కలిగిస్తోందని అన్నారు. తన పౌరసత్వం అనేది రాజకీయాలకు అతీతంగా చట్టబద్ధమైనదని తెలిపారు అక్షయ్. అంతేకాదు పౌరసత్వం అనేది తన వ్యక్తిగతమని, అలాంటి తన వ్యక్తిగతమైన విషయం గురించి ఇతరుకెందుకు ? అని ప్రశ్నించారు. “బలమైన భారత్” రూపొందించడంలో తనవంతు సహకారం ఎప్పుడూ అందిస్తానని అన్నారు అక్షయ్.

Related posts