telugu navyamedia
సినిమా వార్తలు

అక్షయ్‌కుమార్‌కు మాతృవియోగం

బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి అరుణ భాటియా బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె వయసు 80 ఏళ్లు. కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆమె కాసేపటి క్రితమే కన్నుమూసారు. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

‘మా అమ్మ అరుణ భాటియా నేటి ఉదయం ఈలోకాన్ని విడిచిపెట్టారు. వేరే లోకంలో ఉన్న నా తండ్రిని ఆమె కలవనున్నారు. ఆమె నా ప్రాణం. ఆమె మరణం వల్ల నాకు కలిగిన బాధను మాటల్లో వివరించలేను. ఈ బాధను భరించలేను. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నా కుటుంబం కోసం మీరు చేస్తున్న ప్రార్థనలకు కృతజ్ఞతలు. ఓం శాంతి’ అని అక్షయ్‌ పేర్కొన్నారు. అరుణ భాటియా మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు సంతాపం ప్రకటిస్తున్నారు.


సెప్టెంబర్‌ 3న ముంబయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచినట్లు అక్షయ్‌ తెలిపారు. తల్లి అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న అక్షయ్ కుమార్.. యూకేలో ‘సిండ్రెల్ల’ మూవీ షూటింగ్‌ నుంచి హుటాహుటిని ముంబైకు వచ్చారు .

Related posts