telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఫోర్బ్స్ వరల్డ్స్ హయ్యస్ట్ పెయిడ్ సెలబ్రిటీస్ లిస్ట్ లో స్టార్ హీరో

Akshay-Kumar

ఫోర్బ్స్ వరల్డ్స్ హయ్యస్ట్ పెయిడ్ సెలబ్రిటీస్ లిస్ట్‌ను తాజాగా ప్రకటించింది. గతేడాది జూన్ 1, 2019 నుంచి ఈ ఏడాది జూన్ 1, 2020 వరకు ఆయా వ్యక్తులు సంపాదించిన ఆదాయాన్ని బట్టి ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది. ఫోర్బ్స్ లిస్ట్‌లో 87.5 మిలియన్స్‌ సంపాదనతో హాలీవుడ్ యాక్టర్ డ్వేన్ జాన్సన్ టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు. ఈ జాబితాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్‌ స్థానం సంపాదించారు. అక్షయ్‌కుమార్‌ 2019 జూన్‌ – 2020 జూన్‌ మధ్య రూ.362 కోట్లు (48.5 మిలియన్‌ డాలర్లు) సంపాదనతో… ఫోర్బ్స్‌ టాప్‌-10 జాబితాలో అక్షయ్‌కుమార్‌ 6వ స్థానంలో నిలిచాడు. భారత్‌ నుంచి అక్షయ్‌ ఒక్కడే ఈ లిస్ట్‌లో చోటు సంపాదించడం విశేషం.

Related posts