telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మొదలైన అక్షయ్ అత్రంగీ రే…

Akshay-Kumar

బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు అక్షయ్ కుమార్. ఇటీవల అక్షయ్ విడుదల చేసిన లక్ష్మీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే నిరాశ చెందకుండా అక్షయ్ మరో సినిమాను చేస్తున్నాడు. అయితే ఇటీవల అక్షయ్ తన నూతన సినిమా షూటింగ్‌ను ప్రారంబించాడు. అదే అత్రంగి రే ఈ సినిమాలో సారా అలీ ఖాన్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలను సారా అలీ ఖాన్‌, అక్షయ్‌లు తమ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్‌చేశారు. అయితే వీరు వదిలిన ఫొటోలో అక్షయ్ బ్లాక్ జాకెట్, వైట్ షర్ట్‌లో కనిపించాడు. సారా ఏమో ఒక పల్లెటూరి అమ్మాయిలా, సాదారణ డ్రెస్‌లో కనిపించింది. ఈ ఫోటోతో పాటుగా లైట్స్, కెమెరా, యాక్షన్ అనే మూడు పదాలు చాలా ఆనందానిస్తున్నాయిని రాసుకొచ్చాడు. ఇక సారా దగ్గరికి వస్తే ఆమె చాలా ఎగ్జైట్‌మెంట్ ఫీల్ అవుతున్నారు. స్టార్ హీరో అక్షయ్‌ సరసన నటించడం నాకు చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని ఒకే సారి కలిగిస్తున్నాయి. ఈ సినిమా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో దక్షిణాది హీరో ధనుష్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Related posts