telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనాతో అక్షర హాసన్ మేకప్ ఆర్టిస్ట్ మృతి… అక్షర ఎమోషనల్ పోస్ట్

Akshara-Hasan

తమిళ ప్రముఖ నటుడు కమల్ హాసన్ కుమార్తె, నటి అక్షర హాసన్‌ మేకప్ ఆర్టిస్ట్ సచిన్ దాదా కరోనా వైరస్‌తో ఇటీవల మృతి చెందారు. తనకెంతో ఇష్టమైన మేకప్ ఆర్టిస్ట్ సచిన్‌ను గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు అక్షర. “ఈ మహమ్మారి వల్ల మనం చాలా మంది మంచి వ్యక్తులను కోల్పోయాం. ఈ రోజు బరువెక్కిన గుండెతో నేను ఈ పోస్ట్‌ను రాస్తున్నాను. ‘షమితాబ్’ నుంచి నాకు మేకప్ ఆర్టిస్ట్‌గా ఉన్న నా సోదరుడు సచిన్ దాదా కొవిడ్‌తో చనిపోయాడు. ఆయన ఎంతో సంతోషంగా, ఎప్పుడూ నవ్విస్తూ ఉండేవాడు. నేను ఎవరితో అయినా ప్రాంక్స్ చేశానంటే అది ఆయనే. ప్రతిభావంతుడు. వీటన్నింటి కన్నా ఆయన నాకు స్నేహితుడు. ఇద్దరు కొడుకులకు అద్భుతమైన తండ్రి. ఒక భార్యకు గొప్ప భర్త. ఆయన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’’ అని అక్షర తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. కాగా ప్రస్తుతం అక్షర ‘అగ్ని సిరగుగల్’ అనే తమిళ చిత్రంలో నటించారు. నవీన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. ఈ చిత్రంలో అరుణ్ విజయ్, విజయ్ ఆంటొని, ప్రకాష్, నాజర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Related posts