telugu navyamedia
news telugu cinema news

ఆ సినిమాలో అక్కినేని హీరోలు ముగ్గురు…

అక్కినేని కుటుంబం అంతా ‘నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి మనం సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 2014లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో మల్టీస్టారర్ రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్ నటించనున్నారని సమాచారం. నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా హిట్‌ తర్వాత దానికి సీక్వెల్‌గా రాబోతోందని వార్తలొచ్చాయి. ఆ సినిమాలోని ‘బంగార్రాజు’ పాత్రనే ఆధారంగా చేసుకొని కళ్యాణ్‌ కృష్ణ కథను సిద్ధం చేశారని… ఇందులో నాగార్జున నటించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో నాగార్జునే కాకుండా.. నాగచైతన్య కూడా నటిస్తారని వార్తలొచ్చాయి. తాజా సమాచారం ప్రకారం నాగచైతన్యతోపాటు, అఖిల్‌ కూడా నటించనున్నారని సమాచారం. అయితే తండ్రితోపాటు, తనయులిద్దరూ తెరను పంచుకోనున్నారని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ‘వైల్డ్ డాగ్’ ను సినిమా షూటింగ్ ఇటీవలె పూర్తయింది. ఇక ఇప్పుడు బంగార్రాజుపై నాగ్ దృష్టిసారించారట. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts

కరణం మల్లేశ్వరి బయోపిక్… అధికారిక ప్రకటన

vimala p

వారం రోజుల్లో పెళ్లి ముహూర్తం.. దారుణ హత్యకు గురైన యువతి

vimala p

ట్రంప్ కి మెలానియా విడాకులు ఇవ్వనుందా…?

Vasishta Reddy