telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇవాళ నా 31వ పుట్టిన రోజు… అంటున్న నాగార్జున

Nagarjuna

టాలీవుడ్‌ మన్మథుడు, కింగ్‌ నాగార్జున‌ నేటితో 60 ఏళ్లు పూర్తిచేసుకుని 61వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ, రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ “అంతులేని ప్రేమ, అభిమానం చూపిస్తున్న సీనియర్‌, జూనియర్‌ అక్కినేని అభిమానులకు ధన్యవాదాలు. ఇండస్ట్రీ మిత్రులతో పాటు ఇతర మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. ఇవాళ నా 31వ పుట్టిన రోజు. నిన్నటి నుంచి చాలా మంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రేమ, అభిమానంతో మెసేజ్‌లు చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. 5 నెలల తర్వాత పని చేయబోతున్నందుకు సంతోషంగా ఉంది. త్వరలో బిగ్‌బాస్‌ సీజన్‌ 4 షూటింగ్‌లో పాల్గొంటాను. బిగ్‌బాస్‌ సీజన్‌ 3ని విజయవంతం చేసినట్లే సీజన్‌ 4ను కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్న” అని అన్నారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ వీడియోను కూడా ఆయన విడుదల చేశారు.

Related posts