telugu navyamedia
సినిమా వార్తలు

కర్ర‌సాము అదిరింది..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ ఎప్ప‌టిక‌ప్ప‌డు సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తూనే ఉంటాడు. ఆ తండ్రి బాటలో అకీరా నందన్ న‌డ‌వ‌బోతున్నాడు..అకిరా నందన్ ఇపుడు అన్ని విషయాల్లో ఆరి తేరే పనిలో ప‌డ్డాడు. తన ప్రతిభతో అకిరా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సోష‌ల్ మీడియాలో యాకింట్ ఉండే రేణు దేశాయ్ త‌న పిల్ల‌ల‌కు సంబంధించిన విష‌యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు షేర్ చేస్తుంటారు.

అందులో భాగంగానే అకీరానందన్ కర్ర సాము చేస్తున్న ఒక వీడియోని పాప్ స్టార్ మైకేల్ జాక్సన్ పాటను యాడ్ చేసి రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. జానీ సినిమాలో పవన్ కళ్యాణ్ లాగా అకిరా కర్ర సాము అదరగొట్టాడు అని నెటిజన్లు అతనిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే కుంగ్ ఫూ, కరాటేతో పాటు మ్యూజిక్‌, డాన్సుల్లో కూడా అకిరా శిక్షణ తీసుకున్నాడు.

తండ్రికి తగ్గ తనయుడు అంటూ అకీరా ను కొనియాడుతున్నారు. జానీ 2 అంటూ అకీరా ను ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. కాగా ..త్వరలో పవన్ వారసుడుగా ఆరడుగుల బుల్లెట్ అకిరా నందన్ వెండితెరపై ఏ రేంజ్‌లో ఇరగదీయనున్నాడో ఈ వీడియోను చూస్తుంటే అర్ధమవుతోంది.

Related posts