telugu navyamedia
రాజకీయ వార్తలు

అఖిలేష్‌ను అడ్డుకున్న లక్నో పోలీసులు

Akhilesh Yadav Lucknow airport UP |

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను లక్నో ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి కారణం లేకుండా ఎయిర్‌పోర్టు సిబ్బంది తనను అడ్డుకున్నారంటూ అఖిలేష్‌ ట్వీట్‌ చేశారు. యూపీలో బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షంపై నిర్బంధం విధించి హక్కులను కాలరాస్తోందని తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. అఖిలేష్ యాదవ్ ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తుండగా లక్నో ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. కారణంలేకుండా అడ్డుకోవడంతో పోలీసులకు అఖిలేష్‌కు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.

షెడ్యూల్ ప్రకారం ఇవాళ సాయంత్రం అలహాబాద్ యూనివర్శిటీ విద్యార్థుల సమావేశానికి అఖిలేష్ హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయనను అక్కడికి వెళ్లకుండా యూపీ పోలీసులు ఎయిర్‌పోర్ట్‌లోనే అడ్డుకోవడంపై అఖిలేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానం వెళ్లిపోయిన తరువాత ఆయనను ఎయిర్‌పోర్టు నుంచి బయటకు పంపించారు.

Related posts