telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పాత్రలు మార్చుకున్న .. అఖిల్, చై ..

akhil replaced with chai in bangarraju movie

నటుడు నాగార్జున సినీ జీవితంలో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో ఒకటైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి రెండో భాగంగా ‘బంగార్రాజు’ చిత్రాన్ని ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బంగార్రాజు మనవడి పాత్రలో తొలుత నాగచైతన్య నటించనున్నాడన్న వార్తలు వచ్చాయి. అయితే, ఈ పాత్రను నాగచైతన్య కన్నా అఖిల్ తో నటింపజేస్తే బాగుంటుందన్న దర్శకుడి అభిప్రాయంతో నాగ్ ఏకీభవించినట్టు తెలుస్తోంది.

బంగార్రాజుకు, అతని మనవడికి మధ్య జరిగే కథతో ఈ సినిమా నిర్మితమవుతుండగా, ప్రస్తుతం దర్శకుడు కల్యాణ్ కృష్ణ స్క్రిప్ట్ కు తుది రూపును ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారు. నాగ్ ఇప్పుడు ‘మన్మధుడు-2’ షూటింగ్ లో ఉండగా, అది పూర్తికాగానే ‘బంగార్రాజు’ మొదలవుతుందని సమాచారం.

Related posts