telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

వచ్చే నెలలో అఖిల్ కొత్త సినిమా…

akhil

సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఐదు సంవత్సరాలు పూర్తయిన ఇప్పటివరకు సరైన హిట్ లేదు అక్కినేని వారసుడు అఖిల్ కి. అయితే ఇటీవల అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ సినిమాను చేశాడు. ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది. ఇందులో పూజ హెగ్దె అఖిల్ సరసన నటించింది. అయితే ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే అఖిల్ తన తదుపరి ప్రాజెక్ట్ ఓకే చేశాడు. దర్శకుడు సురేందర్ రెడ్డితో తన తదుపరి చిత్రం చేసేందుకు అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా కోసం అఖిల్ శరీర ధారుడ్యం పెంచుకునే పనిలో ఉన్నాడు. ఎందుకుంటే ఈ చిత్రంలో అఖిల్ కండలు తిరిగి కనిపించాలి. అంతేకాకుండా ఈ చిత్రం షూటింగ్ విదేశాలలో కూడా జరగనుంది. దానికి కారణం ఇందులో అఖిల్ ఓ స్పై ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ను హైదరాబాద్‌లో పూజాకార్యక్రమాలతో మొదలు చేసేందుకు మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఇక రెగ్యులర్ షూటింగ్ విషయానికొస్తే వచ్చే నెలలో ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమా ఇప్పటి వరకు అఖిల్ చేసిన సినిమాల్లోకన్నా భారీ బడ్జెట్‌గా తెరకెక్కనుంది. దీని షూటింగ్‌‌లో మొదటి షెడ్యూల్ నుంచే అఖిల్ పాల్గొననున్నాడు. అయితే ఇందులో హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ రష్మకతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటనైతే రాలేదు. చుడాలిమరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనేది.

Related posts