telugu navyamedia
news telugu cinema news

త్వరలో రాబోతున్న అఖిల్ కొత్త సినిమా ఫస్ట్ లుక్…

అఖిల్ అక్కినేని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజ హెగ్దె హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అఖిల్ ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే మరో దర్శకడు సురేంధర్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అఖిల్, సురేంధర్ కాంబోలో స్పై థ్రిల్లర్ రానుందని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. ఇప్పటికీ ఈ సినిమా ప్లాట్ విషయంలో క్లారీటీ లేదు. ఇక ఇదిలా ఉంటె ఈ సినిమా నుండి అఖిల్ పుట్టిన రోజు సందర్భగా ఏప్రిల్ 8న ఉదయం 9:09 గంటలకు అఖిల్ ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్న ఏకె ఎంటర్టైన్మెంట్స్ వారు ట్విట్టర్ వేదిక ఈ విషయాన్ని ప్రకటించారు. అఖిల్ ఈ సినిమా కోసం గుర్రపు స్వారీలో కూడా శిక్షణ తీసుకున్నారు. ఈ శిక్షణకు సంబంధించిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది. ఈ సినిమాను మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారంట.

Related posts

బాయ్ ఫ్రెండ్ తో షూటింగ్ కు వస్తున్న హీరోయిన్

ashok

టోక్యో ఒలింపిక్స్ కు …భారత పురుషుల హాకీ జట్టు..

vimala p

మందలించిన టీచర్ పై విద్యార్థి కక్ష..అర్ధరాత్రి కత్తితో దాడి

vimala p