telugu navyamedia
telugu cinema news trending

ఏజెంట్ గా మారిన అఖిల్..

అఖిల్ అక్కినేని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజ హెగ్దె హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అక్కినేని అఖిల్ బర్త్ డే కానుకగా అభిమానులకు ఓ స్వీట్ గిఫ్ట్ ను ఇచ్చేశాడు. అతని ఐదో చిత్రానికి ‘ఏజెంట్’ అనే టైటిల్ కన్ ఫామ్ చేశారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ సరికొత్త గెటప్ తో కనిపించబోతున్నాడు. బర్త్ డే సందర్బంగా ఆ నయా లుక్ ను విడుదల చేశారు. సురేందర్ రెడ్డికి తాను పూర్తిగా సరెండర్ అయిపోతున్నానంటూ అఖిల్ ప్రకటించడం విశేషం. వక్కంతం వంశీ కథను అందిస్తున్న ఈ చిత్రాన్ని సుంకర రామబ్రహ్మంతో కలిసి దర్శకుడు సురేందర్ రెడ్డి ‘సురేందర్ 2 సినిమా’ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు.  ఎస్.ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 11 నుండి మొదలు కానుంది. ఈ యేడాది డిసెంబర్ 24న తమ ‘ఏజెంట్’ జనం ముందుకు వస్తాడని ప్రకటించారు.

Related posts

మాటిస్ ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు, హీరో జయంత్ రెడ్డి

Vasishta Reddy

అనుష్క బాటలో బాలీవుడ్ హీరోయిన్… ప్లస్ సైజ్…!

vimala p

నితిన్ సినిమాలో శ్రీయ బోల్డ్ రోల్

vimala p