telugu navyamedia
news political Telangana

హైదరాబాద్ చేరుకున్న అక్బరుద్దీన్ .. ఎయిర్ పోర్టు లో ఘనస్వాగతం

MIM Akbaruddin Joined Hospital

లండన్ లో చికిత్స అనంతరం ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఈ రోజు హైదరాబాద్చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనకు ఎంఐఎం శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అక్బరుద్దీన్ వస్తున్నాడని తెలియడంతో పార్టీ శ్రేణులు విమానాశ్రయ ప్రాంతంలో భారీగా చేరుకున్నాయి. విమానాశ్రయంలో అక్బరుద్దీన్ ఒవైసీ ఎంతో హుషారుగా కనిపించారు. ఉత్సాహంగా నడుస్తూ విమానాశ్రయం వెలుపలికి వచ్చారు. అనంతరం తన వాహనంలో నేరుగా ఆయన నివాసానికి తరలివెళ్లారు.

అక్బరుద్దీన్ ఆరోగ్యంతో తిరిగిరావడంతో ఎంఐఎం శ్రేణుల్లో ఆనందం వెళ్లువిరుస్తోంది. గతంలో అక్బరుద్దీన్ పై హైదరాబాద్ లో హత్యాయత్నం జరిగింది. తీవ్రగాయాలపాలైన అక్బరుద్దీన్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. తరచుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండడంతో ఉన్నత వైద్యం కోసం లండన్ వెళ్లారు.

Related posts

లోతట్టు ప్రాంతాల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు : పోలీస్ కమిషనర్

Vasishta Reddy

పది పరీక్షలకు అనుమతివ్వాలని హైకోర్టులో అఫిడవిట్!

vimala p

రాజీనామా చేసేందుకు తాను సిద్దం: వల్లభనేని వంశీ

vimala p