telugu navyamedia
news telugu cinema news

రొమాంటిక్ వచ్చేది ఎప్పుడంటే…?

ఆకాష్ పూరి హీరోగా నటించిన మెహబూబా సినిమా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు ఎలాగైనా తనయుడికి హిట్ ఇవ్వాలనే కసితో కనిపిస్తున్నాడు పూరీ జగన్నాథ్. అయితే ప్రస్తుతం ఆకాష్ రొమాంటిక్ అనే సినిమాలో నటిస్తున్నాడు. దీని కోసం కథ – స్క్రీన్ ప్లే – మాటలు అందించి కొత్త దర్శకుడు అనిల్ పాడూరికి దర్శకత్వ భాధ్యతలు అప్పగించాడు పూరీ. ఈ సినిమాని పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ జగన్నాథ్ – చార్మీ కలిసి నిర్మించారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమాలోని క్లైమాక్స్ తో పాటు కొన్ని ముఖ్యమైన సీన్స్ షూట్ చేయలేకపోయారట.. అయితే ఇటీవల షూటింగ్ తిరిగి మొదలుపెట్టి సినిమాను పూర్తి చేసారు. దాంతో తాజాగా ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించారు. రొమాంటిక్ సినిమా జూన్ 18న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇక అదే రోజు అఖిల్ అక్కినేని నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కూడా విడుదల అవుతుంది. అయితే రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే విడుదలైన వీడియోలు మరియు ఫొటోలతో అర్థం అవుతుంది.యూత్ ఆడియన్స్ టార్గెట్ గా రూపొందించిన ఈ సినిమా ఆకాష్ పూరికి హిట్ ను అందిస్తుందా… లేదా అనేది చూడాలి.

Related posts

చిరు ఈ పాటని ఎంతలా ఇష్టపడుతున్నాడంటే… మనవరాలితో కలసి…

vimala p

“అశ్వథ్థామ” మా వ్యూ

vimala p

బాలకృష్ణ వ్యాఖ్యలపై ఇప్పుడు స్పందించను : మంత్రి తలసాని

vimala p