telugu navyamedia
సినిమా వార్తలు

అజిత్ అభిమానుల నిర్వాకం… విజయ్ చనిపోయాడంటూ ప్రచారం

Vijay-and-Ajith

సాధారణంగా అభిమానులు వారికి నచ్చిన హీరోల‌ని దేవుళ్ళుగా ఆరాధించ‌డం, వారి పేరుతో సేవా కార్య‌క్ర‌మాలు చేయ‌డం చేస్తుంటారు. అయితే హీరోల మీద ఉన్న అభిమానం ఇలా మంచి చేయడానికి ఉపయోగపడితే మంచిదే. కానీ ఒక్కోసారి అభిమానులు చేసే వికృత చేష్ట‌లు స్టార్స్ కు కూడా కోపం తెప్పిస్తాయి. కోలీవుడ్ లో స్టార్ హీరోలు అజిత్, విజయ్ ల అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే విషయం తెలిసిందే. తాజాగా అజిత్ అభిమానులు త‌మిళ స్టార్ హీరో విజ‌య్ చనిపోయారని ప్ర‌చారం చేస్తున్నారు. రిప్ యాక్ట‌ర్ విజ‌య్ అనే హ్యాష్ ట్యాగ్‌తో సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ట్రెండ్ చేస్తున్నారు. అజిత్ అభిమానులు చేసిన ప‌నికి స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. క్రికెట‌ర్ రవిచంద్ర‌న్ అశ్విన్ కూడా ఈ సంఘ‌ట‌న‌పై మండిప‌డ్డారు. “కొన్ని రోజుల క్రితం ఒక గ్ర‌హ‌శ‌క‌లం మ‌న భూగ్రహాన్ని ఢీకొట్ట‌బోయి తృటిలో మిస్ అయింది. వేరు వేరు న‌గ‌రాల‌ని తాకిన రుతుప‌వ‌నాలు దేశంలోని అనేక ప్రాంతాల‌లో క‌రువుతో పాటు బాధ‌ని క‌లిగిస్తున్నాయి. వీట‌న్నింటిని ప‌క్క‌న పెట్టి… మ‌న రాష్ట్రంలో యువ‌త బ‌తికి ఉన్న యాక్ట‌ర్‌ని చ‌నిపోయిన‌ట్టు ప్ర‌చారం చేసే ధోర‌ణి బాధ‌ని క‌లిగిస్తుంది” అని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ వివాదం మ‌రింత ముద‌ర‌క‌ముందే అజిత్ స్పందించి ఈ ప్ర‌చారానికి అడ్డుక‌ట్టు వేయడం మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది.

Related posts