telugu navyamedia
క్రీడలు వార్తలు

పృథ్వీ షా బ్యాటింగ్‌ పై జడేజా సంచలన వ్యాఖ్యలు…

గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో దారుణంగా విఫలమైన పృథ్వీ షా బ్యాటింగ్ టెక్నిక్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో భారత్‌కు వచ్చిన అనంతరం తన లోపాలపై దృష్టిసారించాడు. తన కోచ్‌లతో చర్చించి టెక్నిక్ లోపాలను సరిదిద్దుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో విధ్వంసకర బ్యాటింగ్‌తో మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ టోర్నీలో ఏకంగా 800 పరుగులు చేసి ఈ ఘనతను అందుకున్న తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ఇక ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ అదే జోరును కొనసాగించిన పృథ్వీ షా.. ఢిల్లీ క్యాపిటల్స్ సునాయస విజయాలందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. 8 మ్యాచ్‌ల్లో 308 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలున్నాయి. ఇక కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ ఓవర్‌లోనే 6 ఫోర్లు కొట్టి అరుదైన ఫీట్ నెలకొల్పాడు. తాజాగా షా బ్యాటింగ్‌పై స్పందించిన అజేయ్ జడేజా.. అతని ఆటను కొనియాడాడు. ‘కంప్యూటర్ నుంచి వైరస్ సోకినట్లే.. పృథ్వీ షా బ్యాటింగ్ నుంచి కూడా వైరస్ తీసేసినట్లు అనిపిస్తుంది. గతేడాది అతని టెక్నిక్, మైండ్‌కు కొంచెం వైరస్ సోకింది. ఓ ఆటగాడిగా ఆ షాక్‌ నుంచి షా తేరుకున్నాడు. అతనో అసాధారణమైన ఆటగాడు. సాధారణ ఆటగాడు కూడా ఏ లెవల్ క్రికెట్‌లోనైనా తొలి ఏడాది రాణిస్తాడు. కానీ రెండో ఏడాది కూడా అదే జోరు కనబరుస్తూ అంతకు మించి రాణిస్తే.. వారు ప్రత్యేకమైన ప్లేయర్లు. ఎవరినైనా వెనక్కి నెట్టగల సామర్థ్యం ఉన్నవారు’అని జడేజా చెప్పుకొచ్చాడు.

Related posts