telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“గడ్డలకొండ గణేష్” హిందీ రీమేక్ లో మిల్కీ బ్యూటీ

tamannah

వరుణ్ తేజ్‌ హీరోగా ‘గద్దలకొండ గణేష్’ చిత్రాన్ని ఇటీవల ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు దర్శకుడు హరీష్ శంకర్. 2014లో రిలీజైన ‘జిగర్తాండ’ మూవీ 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 35 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగులోనూ ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అయితే ఇప్పుడు ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయబోతున్నారట. బాబీ సింహా పోషించిన పాత్రని స్టార్ హీరో అజయ్ దేవగన్ చేయబోతున్నాడట. ఇప్పటికే తమిళ ‘ఖైదీ’ రీమేక్ లో నటిస్తున్న అజయ్ దేవగణ్ ‘జిగర్తాండ’ రీమేక్ కి కూడా ఓకే చెప్పేశాడట. అంతేకాకుండా బొమ్మరిల్లు సిద్దార్థ్ ప్లే చేసిన రోల్ కి టాలెంటెడ్ యాక్టర్ ఫర్హాన్ అక్తర్ ని అనుకుంటున్నారట. కాగా మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతోందట. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిచానున్నారని తెలుస్తుంది. మరి ఈ సినిమా హిందీలో ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

Related posts