telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అక్షయ్ విలన్ గా.. అజయ్ అతిధిగా.. ఆర్.ఆర్.ఆర్ మూవీ,.. హీరోయిన్స్ లేరు..!!

ajay devagan as guest role in rrr movie

జక్కన గా పేరుతెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి రోజుకో వార్త విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్ లు ప్రధాన పాత్రలలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరిలో ఎన్టీఆర్ విలన్ గా నటిస్తున్నాడు అంటూ మొదటిలో వార్తలు హాల్ చల్ చేశాయి. అయితే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ను విలన్ గా యూనిట్ స్పష్టం చేయడంతో ఎన్టీఆర్ పాత్ర గురించిన అపోహలు విడిపోయాయి. ఇప్పుడీ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కూడా నటించనున్నారనే వార్త తాజాగా ప్రచారంలోకి రావడం జరిగింది. దీనికి ముందు అజయ్ ని విలన్ గా నటించాలని అడిగితే, ఆలోచనలో పడటంతో అక్షయ్ ని నిర్ణయించారు. ఇక అజయ్ కూడా ఓ అతిథి పాత్రలో కనిపిస్తాడని, పాత్ర చిన్నదే అయినా, అది అందరికీ గుర్తుండి పోతుందనీ అంటున్నారు.

అజయ్ తో రాజమౌళి తన ‘ఈగ’ చిత్రాన్ని హిందీలో అనువదించినప్పుడు వాయిస్ ఓవర్ చెప్పించాడు. అప్పటి నుంచీ వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని, ఆ కారణంగానే ఇందులో గెస్ట్ రోల్ చేయడానికి అజయ్ ముందుకు వచ్చాడని సమాచారం. కాగా, ప్రస్తుతం ఈ చిత్రం రెండో షెడ్యూలు షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ నిర్వహిస్తున్నారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటించే హీరోయిన్ల పేర్లు మాత్రం ఇంకా ప్రకటించలేదు. అప్పటిలో ఎవరెవరి పేర్లో తెరపైకి వచ్చినా అవన్నీ అపోహలే అని తేలింది.

Related posts