telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మనోరమ పాత్రలో నటించి జాతీయ స్థాయి అవార్డు పొందాలని… : ఐశ్వర్య రాజేష్

5 laks bill for just fever to actor aishwarya rajesh

ఇటీవల “శైలజా కృష్ణమూర్తి” అనే స్పోర్ట్స్ డ్రామాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఐశ్వర్యా రాజేష్. ఈ చిత్రంలో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడమే కాకుండా తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ తెలుగమ్మాయి తెలుగులో కంటే తమిళంలోనే నటిగా క్రేజ్ సంపాదించుకుంది. “కాక్కముట్టై” చిత్రంతో ఒక్కసారిగా తమిళ చిత్ర పరిశ్రమలో అందరి దృష్టినీ ఆకర్షించింది నటి ఐశ్వర్యా రాజేష్. అద్భుత నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. జాతీయ అవార్డు పొందిన తమిళ చిత్రం ‘కాక్కా ముట్టై’ చిత్రంలో ఇద్దరు చిన్నారులకు తల్లిగా నటించిన ఐశ్వర్యా రాజేష్‌ తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ చిత్రం తర్వాత ‘ధర్మదురై’, ‘వడ చెన్నై’, ‘సెక్క సివంద వానమ్‌’, ‘కనా’, ‘నమ్మవీట్టు పిళ్ళై’ తదితర చిత్రాల్లో నటించి మంచి నటిగా పేరుతెచ్చుకుంది. ప్రస్తుతం ‘భూమిక’ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి రతీంద్రన్‌ ఆర్‌.ప్రసాద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీక్‌ సుబ్బురాజ్‌, సుదన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేష్‌ సైక్రియాటిస్టు పాత్రలో నటిస్తోంది. ‘భూమిక’ తనకు 25వ చిత్రమని, సైక్రియాటిస్టు పాత్రలో నటించడం తనకెంతో ఆనందంగా ఉందని తెలిపింది. ఈ చిత్రం షూటింగ్‌ ఊటీలో నిర్విరామంగా 35 రోజులపాటు జరిగింది. ఇక ‘ఆచ్చి’ మనోరమ బయోపిక్‌లో మనోరమ పాత్రలో నటించి జాతీయ స్థాయిలో అవార్డు పొందాలని ఆశపడుతున్నానని, అది త్వరలో నెరవేరాలని కోరుకుంటున్నానని తెలిపింది ఈ తెలుగమ్మాయి.

Related posts