telugu navyamedia
సినిమా వార్తలు

ఈ హీరోయిన్ కు ఆ అదృష్టం లేదట…!

Aishwarya Rajesh,Love Breakups
తమిళంలో నటిగా మంచి గుర్తింపును సాధించుకున్న బ్యూటీ ఐశ్వర్య రాజేష్. ప్రస్తుతం ఐశ్వర్య చేతిలో చాలా సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ప్రేమ గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రేమ విషయంలో తనకు అదృష్టం లేదంటోంది ఈ భామ. ప్లస్ టూ చదువుతున్న రోజుల్లో ప్రేమలో పడ్డానని, అది మొదట్లోనే ముగిసిపోయిందని, తాను ప్రేమించిన యువకుడిని తన స్నేహితురాలు తన్నుకుపోయిందని, నమ్మిన స్నేహితురాలి చేతిలోనే మోసపోయానని చెప్పుకొచ్చింది ఐశ్వర్య. ఇక ఆ తరువాత మరోసారి ప్రేమలో పడగా… అప్పుడు కూడా కొన్ని కారణాల వల్ల ప్రేమకు బ్రేకప్ చెప్పాల్సి వచ్చిందని పేర్కొంది. ఇలా తాను రెండుసార్లు ప్రేమలో ఓడిపోయానని, ప్రేమిస్తే అది కలకాలం కొనసాగాలని కోరుకుంటానని, పనీపాటా లేకుండా తిరిగే అబ్బాయిలంటే తనకు అస్సలు ఇష్టం ఉండదని, ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని చెప్పుకొచ్చింది ఐశ్వర్య.

Related posts