telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఐశ్వర్యా ఛాలెంజ్” ట్రైల‌ర్

aishwarya-challenge

వరల్డ్ ఫేమస్ లవర్, కౌసల్య కృష్ణ మూర్తి వంటి చిత్రాలతో న‌టిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో న‌టించిన చిత్రం, రాజమౌళి గారి RRR లో జాయిన్ అవుతున్న ఐశ్వర్య రాజేష్ నటించి పూర్తిగా మలేసియాలో రూపొందించిన ఈ చిత్రాన0 `ఐశ్వర్యా ఛాలెంజ్` పేరుతో త్వరలో విడుద‌ల‌చేస్తున్నారు. అభినయ్..సుమన్ శెట్టి తదితరులు కీల‌క పాత్ర‌ల‌లో నటించారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన `ఐశ్వర్యా ఛాలెంజ్`ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా దీపావ‌ళి కానుక‌గా రామ్‌గోపాల్ వ‌ర్మ బ్లెసింగ్స్‌తో ట్రైల‌ర్‌ని డిజిట‌ల్ మాధ్య‌మంలో విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ప్ర‌స్తుతం సెన్సార్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోన్న ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల‌కి సిద్దంగా ఉంది. ఈ సంద‌ర్భంగా..

నిర్మాణ, నిర్వహణ వెల్లూరు మధుబాబు మాట్లాడుతూ.. నన్ను నమ్మి రెండో సినిమాకు నిర్మాణ నిర్వహణ గా అవకాశం ఇచ్చిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి ఎప్ప‌టికీ రుణపడి ఉంటాను. ఆయనతో నా అనుభంధం ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. పాత్రికేయుడుగా చిరపరిచయం ఉన్న ధీరజ్ అప్పాజీ గారు ఈ చిత్రానికి మాటలు వ్రాసారు. సౌండ్ ఇంజినీర్ నాగేశ్వరరావు గారు అద్భుతమైన నిర్మాణ అనంతర కార్యక్రమాలు నిర్వహించారు. రచ్చ రవి..జబర్దస్త్ రవి తన వాయిస్ ని ఇచ్చారు.పాటలు.రాజు .హర్ష.మోహనరావు, ఐశ్వర్యా తదితరులు పాడారు. సినిమా చూశాను చాలా బాగా వచ్చింది, ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా త్వరలో థియేటర్స్ లో విడుదల కానుంది“ఆహా ఊర్వశి ATT ల ద్వారా కూడా విడుదలకు సన్నాహాలు చేస్తున్న అన్నారు.

Related posts