• Home
  • వార్తలు
  • కుమార్తెతో కలిసి మ్యాచ్‌కి హాజరైన ఐశ్యర్య అభిషేక్
క్రీడలు వార్తలు వార్తలు సామాజిక

కుమార్తెతో కలిసి మ్యాచ్‌కి హాజరైన ఐశ్యర్య అభిషేక్

Aishwarya and abhishek attend the match with his daughter

ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) ఆరో సీజన్‌లో యు ముంబా జట్టు బోణీ కొట్టింది. బుధవారం జరిగిన పోరులో యు ముంబా జట్టు 39-32తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై విజయం సాధించింది. అనూప్‌ కుమార్‌ చివరి సీజన్‌ వరకు యు ముంబా కెప్టెన్‌గా ఉన్నాడు. అంతేకాదు ఆ జట్టుని మూడుసార్లు జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చడంతో పాటు ఓసారి టైటిల్‌ను అందించాడు. అయితే, బుధవారం జరిగిన పోరులో మాత్రం అందుకు భిన్నం. ఈసారి ప్రత్యర్థిగా బరిలో దిగాడు. జోన్‌-ఎలో మాజీ ఛాంపియన్‌ల మధ్య ప్రొకబడ్డీ మ్యాచ్‌ అంచనాలకు తగ్గట్టుగానే నువ్వానేనా అన్నట్టుగా సాగింది. అయితే ఆఖర్లో అదరగొట్టిన యు ముంబా లీగ్‌లో తొలి విజయాన్న నమోదు చేసింది.

మ్యాచ్‌లో 39-32తో పింక్‌ పాంథర్స్‌ను ఓడించింది.చివర్లో దూకుడుగా ఆడిన సిద్ధార్థ్‌ దేశాయ్‌ 13 పాయింట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆఖరి 5 నిమిషాల వరకు పాంథర్స్‌దే విజయమని అంతా భావించారు. అప్పటివరకు మ్యాచ్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన ఆ జట్టు 30-27తో ఆధిక్యంలో నిలిచింది. చివర్లో యు ముంబా ఆటగాళ్లు విజృంభించి జట్టుకు విజయాన్ని అందించారు. తొలి అర్దభాగంలో యు ముంబా జట్టును ఆలౌట్‌ చేసిన పాంథర్స్‌ జట్టు 11-5తో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబా జట్టు అటాకింగ్‌పై దృష్టిసారిస్తే.. పాంథర్స్‌ డిఫెన్స్‌తో ప్రత్యర్థిని బోల్తా కొట్టించింది. మ్యాచ్‌‌లో 30 నిమిషాల పాటు ఇలానే ఆడారు. ఆ తర్వాత సిద్ధార్థ్‌ దేశాయ్‌ దూకుడుగా ఆడటంతో పాంథర్స్ క్రమంగా అధిక్యాన్ని కోల్పోయింది.

యు ముంబా రైడర్‌ సిద్ధార్థ్‌ దేశాయ్‌ (13 పాయింట్లు) అదరగొట్టాడు. రోహిత్‌ బలియన్‌ 7 పాయింట్లు సాధించాడు. పింక్‌పాంథర్స్‌ జట్టులో నితిన్‌ (8) రాణించాడు. అనూప్‌ 4, మోహిత్, సందీప్‌ ధుల్, అమిత్‌ తలా 3 పాయింట్లు చేశారు. ఈ మ్యాచ్‌ను జైపూర్‌ జట్టు యజమాని అభిషేక్‌ బచ్చన్‌ సతీమణి ఐశ్వర్యరాయ్‌ ఆసక్తిగా తిలకించారు. జోన్‌-బిలో జరిగిన మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ 48-37తో తమిళ్‌ తలైవాస్‌ను ఓడించి లీగ్‌లో శుభారంభం చేసింది. పవన్‌ షెరావత్‌ 20 పాయింట్లతో బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కాశీలింగ్‌ అడకె 9 పాయింట్లు సాధించాడు. తలైవాస్‌ జట్టులో అజయ్‌ ఠాకూర్‌ (20) ఒంటరి పోరాటం వృథా అయ్యింది.

Related posts

ఓటర్ల తుది జాబితాపై హైకోర్టు స్టే

madhu

మిర్చి మ్యూజిక్ అవార్డ్స్.. ‘చిత్రాలు’…

chandra sekkhar

భార్య తలను నరికి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిన భర్త

jithu j

Leave a Comment