telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

టెలికాం కంపెనీల బాధుడు.. నేటి అర్ధరాత్రి నుంచి చార్జిల పెంపు!

vodafone idea offer

టెలికాం కంపెనీలు మరోసారి ఛార్జీలు పెంచాలని నిర్ణయించాయి. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు ముందు నుంచి చెబుతున్నట్లుగానే తమ ప్రీపెయిడ్ కస్టమర్లకు గాను టారిఫ్‌లను పెంచాయి. ఈ క్రమంలో ఆయా టెలికాం కంపెనీల ప్లాన్ల చార్జిలు 50 శాతం వరకు పెరిగాయి. ఇక పెంచిన ధరల ప్రకారం నేటి అర్ధరాత్రి నుంచే ఆయా టెలికాం కంపెనీలు చార్జిలను వసూలు చేయనున్నాయి.

వొడాఫోన్ ఐడియా నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు నిమిషానికి 6 పైసలు వసూలు చేయనున్నారు. అయితే ఈ కాల్స్ చేయడానికి వినియోగదారులు ప్రత్యేక రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు గాను వారికి రూ.49, రూ.79 రీచార్జి ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక కనీసం రూ.49 అయినా రీచార్జి చేయించుకుంటేనే వినియోగదారులు ఇన్‌కమింగ్ కాల్స్‌ను కూడా స్వీకరించేందుకు అవకాశం ఉంటుంది. అదే అన్‌లిమిటెడ్ ప్లాన్లు వాడితే ప్రత్యేక రీచార్జి చేసుకోవాల్సిన పనిలేదు. ఆ ప్లాన్లలోనే ఇతర నెట్‌వర్క్‌లకు చేసుకునేవిధంగా కాల్స్ వస్తాయి.

ఇక వొడాఫోన్ ఐడియాలాగే ఎయిర్‌టెల్ కూడా ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు నిమిషానికి 6 పైసలు వసూలు చేయనుంది. అందుకు వినియోగదారులు ప్రత్యేక రీచార్జి చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారికి రూ.19, రూ.49, రూ.79 ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా రీచార్జి చేసుకుంటేనే వినియోగదారులు ఇన్‌కమింగ్ కాల్స్‌ను స్వీకరించేందుకు అవకాశం ఉంటుంది.

Related posts