telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

ఎయిర్ టెల్ . బ్రాడ్ బ్యాండ్ లో .. భారీ ఆఫర్లు ..

airtel huge offers in broadband services

జియో బ్రాడ్ బ్యాండ్ ప్రవేశంతో, దేశీయ బ్రాడ్ బ్యాండ్ రంగంలో కీలక పరిణామాలు చోటు చేసుకోగా, దిగ్గజ కంపెనీలు ప్రస్తుతం ఉన్న కస్టమర్లను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉచిత డేటా సునామితో టెలికం రంగంలో ప్రకంపనలు సృష్టించి రిలయన్స్ జియో అదే ఊపును బ్రాడ్ బ్యాండ్ రంగంలో కొనసాగించేందుకు వ్యూహా రచన చేస్తోంది.ఈ వ్యూహాన్ని పసిగట్టిన కంపెనీలు దానికంటే ముందుగానే ఆఫర్లను ప్రకటిస్తూ పోతున్నాయ. ఇందులో భాగంగానే ఎయిర్‌టెల్ ఫైబర్ నెట్ వినియోగదారుల కోసం ఉచిత డేటాను అందిస్తోంది. ఎయిర్‌టెల్ అందిస్తున్న ఉచిత డేటా వివరాలను ఓ సారి పరిశీలిస్తే..టెలికాం రంగంలో ఇప్పటికే జియో దెబ్బకు భారీగా నష్టం చవిచూసిన ఎయిర్‌టెల్‌ ఈ సారి ముందుగానే తేరుకుంది. బ్రాడ్‌బ్యాండ్‌ సేవల్లోకీ జియో ప్రవేశిస్తోందన్న వార్తల నేపథ్యంలో తన కొత్త వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.

airtel huge offers in broadband servicesఎయిర్‌టెల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ బిగ్‌ బైట్‌ ఆఫర్‌ పేరిట లిమిటెడ్‌ పిరియడ్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌ కింద బ్రాడ్‌బాండ్‌ వినియోగదారులకు 1000 జీబీ వరకు అదనపు డేటాను అందిస్తోంది. ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ తన సబ్‌స్క్రైబర్లకు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ వంటి సేవలను మూడు నెలలపాటు ఉచితంగానే అందిస్తోంది. అలాగే మిగిలిన డేటాకు క్యారీ ఫార్వర్డ్ ఆప్షన్ ఆఫర్ చేస్తోంది. లాంగ్ టర్మ్ ప్లాన్లపై డిస్కౌంట్, బోనస్ డేటా సదుపాయాన్ని కల్పిస్తోంది. బోనస్ డేటాలో భాగంగా 1000 జిబి డేటాను అందిస్తోంది. దీని వ్యాలిడిటీ మొత్తం ఆరునెలలు. ఈ ఆఫర్ మార్చి 31తో ముగిసినప్పటికీ కంపెనీ మళ్లీ ఈ ఆఫర్ ను పొడిగించింది. మీరు ఏ Airtel వీ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఎంచుకున్నా కూడా ఆరు నెలల పాటు అదనపు డేటా ప్రయోజనాలు పొందొచ్చు. ఎయిర్‌టెల్ వీ ఫైబర్ ప్లాన్స్ రూ.399 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇక ప్రీమియం ప్లాన్ ధర రూ.2,199గా ఉంది.

అయితే బోనస్ డేటా ప్రయోజనాలు మాత్రం నెలకు రూ.799 రీఛార్జ్ ప్లాన్ నుంచి వర్తిస్తాయి. ఈ ప్లాన్‌పై 500 జీబీ డేటాను అదనంగా పొందొచ్చు. రూ.999 ప్లాన్‌పై 1,000 జీబీ డేటా బోనస్‌గా లభిస్తోంది. రూ.1,299, రూ.1,999 ప్లాన్లపై కూడా ఇదే ఆఫర్ ఉంది.

Related posts