telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సాంకేతిక

జియో ఫైబర్‌ను దీటుగా .. ఎయిర్‌టెల్‌ .. సరికొత్త సేవలు..

airtel fiber services started

భారతీ ఎయిర్‌టెల్‌ జియో ఫైబర్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ పేరుతో ఇంటర్నెట్‌ వినియోగదారులకు వేగవంతమైన సేవలను అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ ద్వారా నెలకు రూ.3999 చెల్లిస్తే 1జీబీపీఎస్‌ వేగంతో అన్‌లిమిటెడ్‌ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ను ఇప్పుడు దేశంలోని 15 ప్రధాన నగరాల్లో అందుబాటులో తీసుకువచ్చింది. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ ప్లాన్‌ ద్వారా ఇంటర్నెట్‌తో పాటు వినియోగదారులకు ఆ సంస్థ మరికొన్ని అదనపు ప్రయోజనాలను చేకూర్చనుంది. అవేంటో తెలుసుకుందాం. ఈ ప్లాన్‌ ద్వారా దేశవ్యాప్త అపరిమిత కాలింగ్‌ సౌకర్యాన్ని ఎయిర్‌టెల్‌ అందించనుంది. అంతేకాకుండా ఎక్స్‌ట్రీమ్‌ యాప్‌ ద్వారా మూడు నెలల నెట్‌ఫ్లిక్స్‌ చందా, ఏడాది పాటు అమెజాన్‌ ప్రైమ్‌తో పాటు జీ5 ప్రీమియం కంటెంట్‌ను కూడా అందించనుంది.

ఎయిర్‌టెల్‌ సంస్థ ఈ ప్లాన్‌ను వ్యక్తిగత వినియోగదారులతో పాటు వాణిజ్య వినియోగదారులకు కూడా అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం సంస్థ ఈ ప్లాన్‌ను దేశంలోని 15 ప్రధాన నగరాల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. అహ్మదాబాద్‌, బెంగళూరు, ఛండీగఢ్‌, చెన్నై, దిల్లీ, ఫరీదాబాద్‌, ఘజియాబాద్‌, గురుగ్రామ్‌, హైదరాబాద్‌, జైపూర్‌, కోల్‌కతా, ముంబయి, నోయిడా, పుణెల్లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం జియో ఫైబర్‌ ప్లాటినం ఆఫర్‌, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ రెండు రూ.3999తో ఒకే ధర కలిగి ఉన్నాయి. పైగా జియోతో పోలిస్తే ఎయిర్‌టెల్‌ నెలసరి ఎఫ్‌యూపీ డేటా ఇంకా ఎక్కువగానే ఇస్తోంది. జియో నెలవారీ ఎఫ్‌యూపీ 2500 జీబీ ఇవ్వనుండగా, ఎయిర్‌టెల్‌ 3333 జీబీ ఇస్తోంది. రెండు ప్లాన్లలో అపరిమిత కాలింగ్‌ సౌకర్యం కూడా ఉంది. జియో ద్వారా ఓటీటీ యాప్స్‌ వార్షిక సభ్యత్వం పొందవచ్చు.

Related posts