telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఇకనుంచి విమానాల్లో కూడా నిలబడే ప్రయాణం…!!

Seats

సాధారణంగా బస్సుల్లో, రైళ్లలో ప్రయాణికులు నిలబడి ప్రయాణించడం మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు విమానాల్లో కూడా నిలబడి ప్రయాణం చేయొచ్చట. ఓ ఇటాలియన్ సంస్థ నిలబడి విమాన ప్రయాణం చేయడానికి అనువుగా ఉండే సీట్లను తయారుచేసి 2010లోనే అమ్మకానికి పెట్టింది. అయితే వాటిని అప్పుడెవరూ కొనుగోలు చేయలేదు. ఆ సీట్లకు కొన్ని మెరుగులు దిద్దిన ఏవియో ఇంటీరియర్స్ అనే ఆ సంస్థ సైరైడర్ 3.0 పేరిట కొత్త సీట్లను ప్రదర్శించింది. వీటిపై పెద్ద పెద్ద ఎయిర్‌లైన్స్ సంస్థలు ఆసక్తి కనబరచకపోయినప్పటికీ, చిన్న ఏవియేషన్ సంస్థలు వీటిపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఎకానమీ క్లాసులో వెళ్లే ప్రయాణికులకు ఈ సీట్లు కేటాయించాలని ఆ సంస్థలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణ ఎకానమీ క్లాసు సీటు కంటే కొంచెం చిన్నదిగా ఉండే ఈ సైరైడర్ 3.0లో కాళ్లు పెట్టుకోవడానికి 23 అంగుళాల ప్రాంతాన్ని మాత్రమే కేటాయించారు. ఇది మామూలు సీటు కంటే 7 అంగుళాలు తక్కువ. ఈ సీటుకు జాకెట్ లాంటివి తగిలించుకోవడానికి హుక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే చిన్న బ్యాగ్ పెట్టుకోవడానికి ఓ షెల్ఫ్ కూడా ఉంటుంది. అయితే ఈ సీట్లలో ప్రయాణం పెద్ద కష్టం కాబోదని, దీనిలో కూర్చుంటే దాదాపు గుర్రపుస్వారీ చేసినట్లే ఉంటుందని వీటి తయారీదారులు చెప్తున్నారు. నెటిజన్లు మాత్రం దీనిపై నెగెటివ్ గా స్పందిస్తున్నారు.

Related posts