telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్ : .. కాలుష్యానికి ఆటవిడుపు.. ఔట్‌డోర్‌ ఎయిర్‌ పొల్యూషన్‌ ప్యూరిఫైయర్స్‌…

air pollution purifier in hyderabad also

రాజధాని లో కాలుష్యం దెబ్బతో .. హైదరాబాద్‌ నగరానికీ కాలుష్యం ముప్పు పొంచి ఉందని ముందస్తు జాగర్తలు మొదలుకానున్నాయి. దీని తీవ్రతను తగ్గించేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది. ఢిల్లీ, ముంబై, థానే, పుణే, గోవా నగరాల్లో మాదిరిగా ఔట్‌డోర్‌ ఎయిర్‌ పొల్యూషన్‌ ప్యూరిఫైయర్స్‌ (ఓయాప్‌) ఏర్పాటు చేసే యోచనలో ఉంది. తొలి దశలో పైలట్‌గా నగరంలో రద్దీ కలి గిన, ఎక్కువ కాలుష్యం ఉండే.. ఎంపిక చేసిన వంద ట్రాఫిక్‌ జంక్షన్ల వద్ద వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

ఈ సాధనాలు కలుషిత వాతావరణంలో పీఎం 2.5, పీఎం 10, కార్బన్‌ మోనాక్సైడ్, వొలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌ (వీఓసీ), హైడ్రో కార్బన్స్‌ వంటి విష వాయువులు మిళితమై ఉంటాయి. ఇవి తీవ్ర శ్వాస సంబంధ సమస్యలను కలుగజేస్తాయి. గాలిలోని ఈ విష వాయువుల్ని ‘ఓయాప్‌’లోని ప్యూరిఫైయర్స్‌ ఫిల్టర్‌ చేస్తాయి. తద్వారా గాలిలోని కాలుష్యం తీవ్రత తగ్గుతుంది. నగరంలో ఇటీవల వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. భారీ భవన నిర్మాణాలతో మున్ముందు సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఎస్సార్‌డీపీ పనుల్లో భాగంగా చేపట్టిన భారీ ఫ్లైఓవర్లు, 30 – 40 అంతస్తుల నిర్మాణాలతో కాలుష్య సమస్యలు పెరగనున్నాయని పర్యావరణ నిపుణులు అంటున్నారు.

Related posts