telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

జెట్ విమానాలను .. అద్దెకు అడుగుతున్న .. ఎయిర్ ఇండియా

air india request to jet airways for planes

ఎయిర్‌ ఇండియా ఛైర్మన్‌ అశ్విని లోహాని ఎస్‌బిఐ ఛైర్మన్‌ రజనీష్‌కుమార్‌కు లేఖ రాశారు. ఇటీవల జెట్‌ విమాన సేవలు తాత్కాలికంగా నిలిపివేసిన కారణంగా ఆ విమానాలను తమకు లీజ్‌కివ్వాలని ఆయన లేఖలో కోరారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ దగ్గర ఇప్పుడు 16 అతి భారీ విమానాలున్నాయి. వాటిలో బోయింగ్‌కు 777-300 ఈఆర్‌ విమానాలు 10 ఉంటే మిగిలిన ఆరు ఎయిర్‌బస్‌కు చెందిన ఏ 330 ఎస్‌ విమానాలున్నాయి.

ఓ 5 బోయింగ్‌ విమానాలను తమకు లీజుకిస్తే అంతర్జాతీయ రూట్లలో నడుపుతామని ఎయిర్ ఇండియా కోరింది. ఈ విషయంపై రజనీష్‌ను ఈ రోజు లోహాని నేరుగా కలిసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోవడం వల్ల సంస్థ పగ్గాలు అప్పులిచ్చిన ఎస్‌బిఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం చేతుల్లోకి వెళ్లాయి. జెట్‌ తన సేవలను పూర్తిగా నిలిపివేసింది. ఇప్పడు ఆ విమానాలన్నీ ఖాళీగానే ఉన్న తరుణంలో వాటిని ఉపయోగించుకునేందుకు లోహాని ఎస్‌బిఐ రజనీష్‌కు లేఖ రాశారు.

Related posts