telugu navyamedia
వార్తలు సామాజిక

పైలట్‌కు కరోనా‌ నిర్ధారణ..ఎయిరిండియా విమానం వెనక్కి

Air India flight

లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా వెనక్కి రప్పిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా శనివారం ఢిల్లీ నుంచి రష్యా రాజధాని మాస్కో బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానాన్ని మార్గమధ్యలోనే వెనక్కి రప్పించారు. విమానంలోని పైలట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని విమానయాన సంస్థ గ్రౌండ్‌ సిబ్బంది గుర్తించారని ఎయిర్‌ఇండియా సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

‘వందే భారత్‌ మిషన్‌లో భాగంగా ఏ320 విమానం ప్రయాణికులు లేకుండానే మాస్కో బయలుదేరింది. ఉజ్బెకిస్థాన్‌ గగనతలంలోకి చేరుకునే సమయానికి పైలట్లలో ఒకరికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలిందని మా సిబ్బంది గుర్తించారు. వెంటనే విమానం వెనక్కి రావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో, విమానం ఢిల్లీకి తిరిగి వచ్చింది. సదరు పైలట్ ను ఐసొలేషన్ వార్డుకు తరలించి, ఇతర సిబ్బందిని క్వారంటైన్ లో ఉంచారు.

Related posts