telugu navyamedia
క్రైమ్ వార్తలు

‘అగ్నిపథ్​’పై ఆగని నిరసనల హోరు: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు నిప్పు..

*సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో విధ్వంసం సృష్టించిన నిర‌స‌న కారులు.. ర‌ణ‌రంగం
*అగ్నిప‌థ్ కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌
*మూడు ట్రైన్లుకు నిప్పు పెట్టిన నిర‌స‌న‌కారులు
*ఆందోళ‌న కారులు అదుపుచేసేందుకు పోలీసులు
*స్టేష‌న్ కాళీచేయ‌కుంటే ఫైరింగ్ త‌ప్ప‌దంటూ నిర‌స‌న కారుల‌కు పోలీసులు వార్నింగ్‌

అగ్నిపథ్‌ పథకంపై వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళన సెగ ఇవాళ హైదరాబాద్‌ను పాకింది . అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో యువకులు విధ్వంసం సృష్టించారు. హౌరా ఎక్స్‌ప్రెస్‌, ఈస్ట్‌ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ సహా మూడు రైళ్లకు ఆందోళనకారులు నిప్పంటించారు. రైల్వే స్టేష‌న్ బ‌య‌ట ఉన్న బ‌స్సుల‌కు నిప్పు పెట్టారు.

అంత‌టిఆగ‌కుండా రైలు పట్టాలపై పార్సిల్ సామాన్లను కాల్చివేసి… నిరసన తెలిపారు.రైలు ప‌ట్టాల మ‌ధ్య‌లో నిప్పు పెట్టారు. జాతీయ జెండా చేతిలో ప‌ట్టుకుని కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం వెంటనే అగ్నిపథ్‌ను రద్దు చేసి… యథావిధిగా సైనిక ఎంపిక జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

protest against agneepath

నిర‌స‌న కారుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో వందలాది మంది నిర‌స‌నకారులు కర్రలు, రాళ్లతో పోలీసులపై కూడా దాడికి దిగారు.

ప‌రిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు 15 రౌండ్ల కాల్పులు జ‌రిపారు. దీంతో ప‌లువురు నిర‌స‌న కారులుకు గాయాలు అవ్వ‌డంతో స్టేష‌న్‌లోప‌లినుంచి ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తున్నారు.

Related posts