telugu navyamedia
సినిమా వార్తలు

“ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ‌” మా వ్యూ

Agent Sai Srinivasa Athreya completes shooting

బ్యానర్ : స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్
న‌టీన‌టులు : న‌వీన్ పోలిశెట్టి, శ్రుతి శ‌ర్మ త‌దిత‌రులు
దర్శకత్వం: స్వరూప్ ఆర్.ఎస్.జే
సంగీతం : మార్క్ క్రోబిన్
కెమెరామెన్ : సన్నీ కురపాటి
ఎడిటర్ : అమిత్ తిరుపతి

ఇటీవల కాలంలో తెలుగులో డిటెక్టివ్ సినిమాలు బాగా తగ్గిపోయాయి. పెరిగిన సాంకేతికత కారణంగా మెయిల్స్, హ్యాకింగ్ అంటూ రోజుకో కొత్త విధంగా క్రైమ్ పెరిగిపోతోంది. తాజాగా డిటెక్టివ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన “ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ‌” సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొత్త ద‌ర్శ‌కుడు స్వ‌రూప్ రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి థ్రిల్ ను ఇచ్చిందో చూద్దాము.

కథ :
ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ (న‌వీన్ పోలిశెట్టి) నెల్లూరులో అత‌ని మొద‌టి ప్రేయ‌సి ఫాతిమా పేరుమీద పెట్టిన ఫాతిమా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ షార్ట్ గా ఎఫ్‌బీఐ అనే పేరుతో ఓ డిటెక్టివ్ ఏజెన్సీని న‌డుపుతుంటాడు. అయితే ఆత్రేయకు చిన్న చిన్న కేసులు మాత్రమే వస్తుంటాయి. అయితే ఏదైనా పెద్ద కేసును ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటున్న తరుణంలో ఆత్రేయ జైలుకు వెళ్తాడు. అక్క‌డ అత‌నికి మారుతిరావు అనే వ్య‌క్తి ప‌రిచ‌య‌మై త‌న కుమార్తె దివ్యను ఒంగోలులో ఎవ‌రో చంపేశార‌ని చెప్పడంతో ఆ కేసును టేక‌ప్ చేస్తాడు ఆత్రేయ‌. అందులో భాగంగా ఇద్ద‌రిని ఫాలో అవ్వగా… ఆ ఇద్ద‌రూ చంపబడతారు. ఆ నింద ఆత్రేయ మీద ప‌డుతుంది. నిదానంగా ఆలోచించిన అత‌నికి త‌న‌ను ఎవ‌రో ప్లాన్ చేసి, ఆ మ‌ర్డ‌ర్‌లో ఇరికించారని తెలుస్తుంది. ఇంత‌కీ వాళ్లు ఎవ‌రు? ఆత్రేయ వెంబ‌డించిన ఆ ఇద్ద‌రూ ఎవరు ? ఇందులో ఆత్రేయను ఎందుకు ఇరికించారు ? అస‌లు రిలీజియ‌స్ క్రైమ్ అనేది ఎలా జ‌రుగుతుంది ? అసలు ఈ సినిమాలో ఎలాంటి క్రైమ్ జరుగుతోంది ? దాని నుంచి ఆత్రేయ ఎలా బయట పడిగలిగాడు ? అనేది తెలియాలంటే సినిమాను వెండితెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
డిటెక్టివ్‌గా నవీన్‌ పొలిశెట్టి హావభావాలు బాగా పండించాడు. తనలోని అమాయకత్వాన్ని, భయాన్ని దాచిపెట్టి పైకి మాత్రం గంభీరంగా కనిపించే డిటెక్టివ్ నవీన్‌ అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఏఐబీ సిరీస్‌లో విచిత్రమైన డైలాగ్‌ డెలివరీ బాగుంది. హీరోగానే కాకుండా దర్శకుడు స్వరూప్‌తో కలిసి ఈ సినిమాకు స్క్రీన్‌ప్లేను అందించారు. అసిస్టెంట్‌ డిటెక్టివ్‌గా శృతిశర్మ పర్వాలేదనిపించింది. కానీ ఆమె [పాత్రకు అస్సలు ప్రాధాన్యత లేదు. మరో డిటెక్టివ్‌ పాత్రలో సుహాన్‌ నవ్వించాడు. మిగతా నటీనటులు తమ పరిధిమేర నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :
ఒక డిటెక్టివ్‌పైనే హంతకుడిగా ముద్రపడితే… తన కేసును తానే ఎలా పరిష్కరించుకున్నాడనే ఇతివృత్తంతో దర్శకుడు స్వరూప్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. కథలో సాగతీత ఎక్కువగా ఉంది. అయితే దర్శకుడు కమర్షియల్‌ హంగుల కోసం కథను పక్కదారి పట్టించకుండా నిజాయితీగా తాను చెప్పాలనుకున్న కథను తెరపై ఆవిష్కరించిన తీరు మెప్పిస్తుంది. కథనాన్ని స్పీడ్‌గా నడిపించడంలో దర్శకుడు కొంత తడబడ్డాడు. మార్క్‌ కె రాబిన్‌ నేపథ్య సంగీతం బాగుంది. సన్నీ కూరపాటి ఛాయాగ్రహణం సినిమాలోని మూడ్‌ను ఎలివేట్‌ చేస్తుంది. నెల్లూరు నేపథ్యం సినిమాకు చాలా కలిసి వచ్చింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

రేటింగ్ : 3/5

Related posts