telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ధియేటర్లలో విడుదలైన 6 వారాల తర్వాతే OTTలో సినిమా…

Theatre

చైనా నుండి వచ్చిన కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో చిత్ర పరిశ్రమ చాలా నష్టపోయిన విషయం తెలిసిందే. కానీ ఈ మధ్యే మళ్ళీ థియేటర్లు ఓపెన్ కావడంతో వరుసగా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక సింగిల్ ధియేటర్ ఓనర్లు, నిర్మాతల మండలి మధ్య పంచాయితీ తేల లేదు. సింగిల్ ధియేటర్లలో రెంటల్ సిస్టమ్ తొలగించాలని, మల్టీప్లెక్స్ మాదిరిగా పర్సంటేజీ విధానం కొనసాగించాలని  ధియేటర్ ఓనర్లు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ధియేటర్లలో విడుదలైన మూవీని 6 వారాల తర్వాతే OTTలో రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు సమావేశం అయ్యారు. అయితే ఏమీ తేలకపోవడంతో శనివారం మరోసారి ధియేటర్ ఓనర్లతో నిర్మాతల మండలి సమావేశం కావాలని నిర్ణయించారు.  ఒకవేళ తమ సమస్యల్ని పరిష్కరించకపోతే డిమాండ్లను నెరవేర్చకపోతే మార్చి 1 నుంచి తెలంగాణలోని సింగిల్ స్క్రీన్లన్నిటినీ మూసి వేస్తామని ఇప్పటికే నిర్మాతలకు అల్టిమేటమ్ జారీ అయ్యింది. నిజానికి ఫిబ్రవరి- మార్చిలో వరుసగా పలు చిత్రాలు రిలీజ్ లకు సిద్ధమవుతున్నాయి. సమ్మర్ లో భారీ చిత్రాల రిలీజ్ లు ఉన్నాయి. ఇలాంటి వేళ ఈ సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద అడ్డంకిగా మారుతుందనేది సినీ విస్లేశాకుల్ వాదన. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts