telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మళ్ళీ సోనియమ్మే.. సారధిగా..

sonia and rahul appeal to court on case

రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడుగా రాజీనామ చేయడంతో ఆ పార్టీలో సంక్షోభం మొదలైంది. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక భాద్యత వహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామ చేసిన విషయం తెలిసిందే…అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని గట్టేక్కించే నాయకుడు లేకపోవడం కూడ ఆపార్టీ ఇబ్బందులను ఎదుర్కోంటుంది. దీంతో రాహుల్ గాంధిని బుజ్జగించేందుకు చాల మంది సీనియర్ నేతలతోపాటు చివరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సీఎంలు సైతం కలిసి రాహుల్ గాంధి కొనసాగాలని కోరారు. రాహుల్ గాంధీ మాత్రం వెనక్కి తగ్గలేదు. నాయకుల ఒత్తిడి తనపై ఎక్కువవుతుండడంతో చివరకు అధికారిక రాజీనామ చేస్తూ… నాలుగు పేజీల లేఖను సైతం రాశాడు. దీంతోపాటు పార్టీని ప్రక్షాళన చేయడం కోసం ఆయా రాష్ట్రాల నేతలు రాజీనామాలు చేయాలని ఒత్తిడి చేశారు. దీంతో ఆయా రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు పార్టీ ఇంచార్జులు సైతం పార్టీకి రాజీనామాలు చేశారు. ఇక అప్పటి నుండి పార్టీ అధ్యక్షపదవి కోసం పార్టీ సీనియర్లు పేర్లు వినిపించాయి. ఓవైపు మల్లికార్జున్ ఖార్గే తోపాటు సుశిల్ కుమార్ షిండే, మోతిలాల్ వోరా లాంటీ సీనియార్ నాయకుల పేర్లు వినిపించాయి.

నాయకుడి కోసం ఏర్పడిన సంక్షోభంలో ఆ పార్టీ నాయకుల దృష్టి సోనియాగాంధిపై సారించినట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టాలని పార్టీ నేతలు కొరినట్టు సమాచారం. అయితే సోనియా గాంధీ మాత్రం సరిగా స్పందించలేదని పార్టీ నేతలు తెలిపారు.మరోవైపు తాను అధ్యక్షపదవిని తిరిగి చేపడుతున్నట్టు మీడియాలో వచ్చిన వార్తలను సైతం సోనియా గాంధీ కొట్టిపారేశారు. అయితే పార్టీ సీనియర్లు మాత్రం సోనియా గాంధీ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశాలు లేకపోలేదని అని చెబుతున్నారు. 1998లో సోనియా గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. 19ఏళ్ల పాటు అధినేత్రిగా సుదీర్ఘకాలం కొనసాగిన ఆమె.. 2017 డిసెంబరులో ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రాహుల్‌ గాంధీని పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాభవం చవిచూసింది. దీంతో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్‌ రాజీనామా చేశారు.

Related posts